Home /News /movies /

VENKATESH DRISHYAM 2 TO STREAM ON HOTSTAR IN THIS DATE HERE ARE THE DETAILS SR

Drishyam 2 : హాట్ స్టార్‌లో వెంకటేష్ దృశ్యం 2.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు..

Venkatesh Drishyam 2 to stream on hotstar Photo : Twitter

Venkatesh Drishyam 2 to stream on hotstar Photo : Twitter

Drishyam 2 On Hotstar : తెలుగు సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ అసురన్‌తో పాటు ఓ మలయాళీ చిత్రాన్ని రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్టైనా దృశ్యం 2 సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

    తెలుగు సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ అసురన్‌తో పాటు ఓ మలయాళీ చిత్రాన్ని రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్టైనా దృశ్యం 2 సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మలయాళం దృశ్యం 2లో మోహన్ లాల్ హీరోగా చేసారు. ఈ సినిమా అక్కడ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై అదరగొట్టింది. ఇక మొదటి సినిమా దృశ్యంను వెంకటేష్ ఇదివరకే తెలుగులో అదే పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా దృశ్యం 2ను రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా శర వేగంగా షూటింగ్ జరుపుకుని విడుదలకు రెడీ అయ్యింది. దృశ్యం 2 చిత్ర బృందం షూటింగ్‌ను కేవలం 47 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేశారు. విడుదలకు రెడీ అయ్యారు. అయితే ఈ సినిమాను థియేటర్‌లోనే విడుదల చేయాలనీ భావించినా ప్రస్తుత పరిస్థితుల్లో అలా విడుదల చేయలేని స్థితి. దీంతో ఈ సినిమాను డైరెక్ట్‌గా హాట్ స్టార్‌‌లో స్ట్రీమ్ చేయనున్నారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ 9 లేదా 10 తేదీలలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుందని టాక్. వినాయక చవితి సందర్భంగా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వెంకటేష్, మీనా జంటగా నటించారు. నదియా కీలకపాత్రలో కనిపించనుంది. మలయాళంలో ఒరిజినల్ వెర్షన్‌ని తెరకెక్కించిన జీతూ జోసెఫ్‌ తెలుగు వెర్షన్‌కి కూడా దర్శకత్వం వహించారు. సురేష్ బాబు నిర్మించారు.

    ఇక ఈ సినిమాతో పాటు వెంకటేష్ మరో సినిమాను కూడా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. తమిళ్ సూపర్ హిట్టైనా అసురన్ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ నారప్ప పేరుతో రీమేక్ చేశారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ప్రియమణి కీలకపాత్ర పోషించింది. ఈ సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ అయ్యి అదరగొడుతోంది.

    ప్ర‌స్తుతం వెంకటేష్ ఎఫ్3 షూటింగ్‌‌లో పాల్గోంటున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఎఫ్ 2‌కు సీక్వెల్‌గా వస్తోంది. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తమన్నా, మెహ్రీన్, అంజలి ఇతర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎఫ్ 3 ఆగస్టు 27న రిలీజ్ కానుందని గతంలో ప్రకటించారు చిత్రబృందం. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Disney+ Hotstar, Drishyam 2, Hero venkatesh

    తదుపరి వార్తలు