తెలుగు సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh) అసురన్‌తో పాటు ఓ మలయాళీ చిత్రాన్ని రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్టైనా దృశ్యం 2 సినిమాను (Drishyam 2) తెలుగులో రీమేక్ చేశారు. మలయాళం దృశ్యం 2లో మోహన్ లాల్ హీరోగా చేసారు. ఈ సినిమా అక్కడ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై అదరగొట్టింది. ఇక మొదటి సినిమా దృశ్యంను వెంకటేష్ ఇదివరకే తెలుగులో అదే పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా దృశ్యం 2ను రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుని విడుదలకు రెడీ అయ్యింది. అయితే కరోనా కారణంగా థియేటర్స్‌లో విడుదలకాలేదు. దీంతో ఈ సినిమాను హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ చేస్తారని టాక్ వచ్చింది. అయితే వస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాను థియేటర్లోనే విడుదల చేస్తారని తెలుస్తోంది.
దృశ్యం2ను దసరా పండుగ కానుకగా అక్టోబర్ 13 న ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను డిస్నీ+హాట్‌స్టార్ కొనుగోలు చేసింది. ఈ సినిమాను సురేష్ బాబు, ఆంటోనీ పెరుంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి సంయుక్తంగా నిర్మించారు.
దృశ్యం 2 చిత్ర బృందం షూటింగ్‌ను కేవలం 47 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. వెంకటేష్, మీనా జంటగా నటించారు. నదియా కీలకపాత్రలో కనిపించనుంది. మలయాళంలో ఒరిజినల్ వెర్షన్‌ని తెరకెక్కించిన జీతూ జోసెఫ్ తెలుగు వెర్షన్‌కి కూడా దర్శకత్వం వహించారు.
ఇక ఈ సినిమాతో పాటు వెంకటేష్ (Venkatesh) మరో సినిమాను కూడా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. తమిళ్ సూపర్ హిట్టైనా అసురన్ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ నారప్ప (Narappa )పేరుతో రీమేక్ చేశారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ప్రియమణి కీలకపాత్ర పోషించింది. ఈ సినిమా కరోనా కారణంగా ఆ మధ్య అమెజాన్ ప్రైమ్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ అయ్యి మంచి ఆదరణ పొందింది.
ఇక వెంకటేష్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం ఎఫ్3 సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఎఫ్ 2కు సీక్వెల్‌గా వస్తోంది. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తమన్నా, మెహ్రీన్, అంజలి ఇతర కీలక పాత్రలో కనిపించనున్నారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.