• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • VENKATESH DRISHYAM 2 PRODUCER SURESH BABU CLARITY ON OTT RELEASE TA

Venkatesh - Drishyam 2: ఓటీటీలో వెంకటేష్ దృశ్యం 2.. నిర్మాత సురేష్ బాబు క్లారిటీ..

Venkatesh - Drishyam 2: ఓటీటీలో వెంకటేష్ దృశ్యం 2.. నిర్మాత సురేష్ బాబు క్లారిటీ..

వెంకటేష్ ‘దృశ్యం 2’

Venkatesh - Drishyam 2: టాలీవుడ్  సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్... వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో దృశ్యం 2 సినిమా ఉంది. ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయడంపై నిర్మాత సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు.

  • Share this:
    Venkatesh - Drishyam 2: టాలీవుడ్  సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్... వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈయన హీరోగా తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన ‘అసురన్’ సినిమాను తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ చేసాడు. ఈ సినిమాను మే 14న థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు. దీంతో పాటు వెంకటేష్ మలయాళీ చిత్రాన్ని మరోసారి రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా చేసిన దృశ్యంను ఆయన ఇదివరకే తెలుగులో రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు.  తాజాగా  దృశ్యం 2ను రీమేక్ చేసాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది. కేవలం 47 రోజుల్లో ఈ సినిమా షూటింగ్‌ను పూర్తైయింది.  అక్కడ ఈ సినిమా థియేటర్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. మలయాళంలో దృశ్యం 2ను డైరెక్ట్ చేసిన అదే దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగులో కూడా తెరకెక్కిస్తున్నాడు.

    ’దృశ్యం 2’ ఈ సినిమా 2014లో వచ్చిన దృశ్యంకు సీక్వెల్’గా వస్తోంది. ఈ సినిమాలో ట్విస్ట్‌లు, కథనం ప్రేక్షకుల్నీ కట్టిపడేశాయి. అనుకోకుండా జరిగిన ఓ మర్డర్ నుండి తన ఫ్యామిలీని ఎలా హీరో కాపాడుకున్నాడు అనేది కథ. ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ ప్రేక్షకులను తెగ ఆకట్టకుంది. ఇక ఈ దృశ్యం 2 సినిమాను తెలుగులో సురేష్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మిస్తున్నాడు. మీనా, వెంటకేష్ ప్రధాన పాత్రలు చేస్తుండగా.. నదియా మరో కీలకపాత్రలో కనిపించనుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉంది.

    Venkatesh - Drishyam 2 Telugu Remake Will Streming On OTT Platform Here Are The Details,Venkatesh - Drishyam 2: వెంకటేష్ ‘దృశ్యం 2’ ఓటీటీ విడుదల చేయనున్నారా.. ?,Venkatesh Drishyam 2 Telugu Remake Release on OTT Platform,Dirshyam 2 Telugu OTT Platform,Drishyam 2 telugu news, venkatesh drishyam 2 shooting, drishyam 2 telugu shooting, drishyam 2 telugu, venkatesh drishyam 2,venkatesh drishyam 2 remake,venkatesh drishyam 2 telugu remake,mohanlal venkatesh drishyam 2,venkatesh drishyam 2 jeethu joseph,venkatesh confirmed drishyam 2 remake,telugu cinema,దృశ్యం 2,దృశ్యం 2 తెలుగు రీమేక్,వెంకటేష్ దృశ్యం 2 తెలుగు రీమేక్,ఓటీటీలో విడుదల కానున్న దృశ్యం 2 మూవీ,ఓటీటీలో రిలీజ్ కానున్న వెంకటేష్ దృశ్యం 2
    దృశ్యం 2 టీమ్ Photo : Twitter


    పైగా ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్స్‌కు వచ్చే సాహసం చేయడం లేదు. దీంతో చిత్ర నిర్మాత సురేష్ బాబు.. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు పుకార్లు షికార్లు చేసాయి. అంతేకాదు ఇప్పటికే ఓ టాప్ స్ట్రీమింగ్ కంపెనీ ఈ సినిమా రైట్స్‌ను రూ. 30 కోట్ల భారీ రేటుకు దక్కించుకున్నట్టు సమాచారం. తాజాగా ఈ  సినిమాను ఓటీటీలో విడుదలపై వస్తున్న వార్తలపై నిర్మాత సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. ’దృశ్యం 2’ సినిమాను కరోనా సెకండ్ వేవ్ ఉదృతి తగ్గగానే ఈ సినిమాను సరైన సమయంలో థియేటర్స్‌లోనే విడుదల చేస్తామంటూ క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత డిజిటిల్ స్ట్రీమింగ్ ఉంటుదంటూ కుండ బద్దలు కొట్టారు. మొత్తంగా ‘దృశ్యం 2’ సినిమాను ఓటీటీలో కాకుండా ముందుగా థియేటర్స్‌లో విడుదల కానున్నదన్నమాట.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: