Home /News /movies /

VENKATESH DRISHYAM 2 MOVIE CENSOR COMPLETED HERE ARE THE DETAILS TA

Venkatesh - Drishyam 2 : వెంకటేష్ ‘దృశ్యం 2’ సినిమా సెన్సార్‌ కంప్లీట్.. టాక్ ఎలా ఉందంటే..

వెంకటేష్ ‘దృశ్యం 2’ సెన్సార్ కంప్లీట్ (Twitter/Photo)

వెంకటేష్ ‘దృశ్యం 2’ సెన్సార్ కంప్లీట్ (Twitter/Photo)

Venkatesh - Drishyam 2 : విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దృశ్యం 2’. దాదాపు 8 యేళ్ల క్రితం విడుదలైన ‘దృశ్యం’ మూవీకి సీక్వెల్‌గా  ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది.

    Venkatesh - Drishyam 2 : విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దృశ్యం 2’. దాదాపు 8 యేళ్ల క్రితం విడుదలైన ‘దృశ్యం’ మూవీకి సీక్వెల్‌గా  ఈ సినిమా తెరకెక్కింది. ఇక వెంకటేష్ కూడా మోహన్‌లాల్ నటించిన అప్పటి సూపర్ హిట్ ‘దృశ్యం’ చిత్రాన్ని అదే టైటిల్‌తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే కదా. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా మీనా హీరో,హీరోయిన్లుగా తెరకెక్కిన ‘దృశ్యం 2’ సినిమాను అదే టైటిల్‌తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఎపుడో ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది. ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కానీ తాజాగా ఈ చిత్రాన్ని డైరెక్ట్‌గా థియేట్రికల్ వేదికగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

    తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు U/A జారీ సర్టిఫికేట్ చేసారు. దృశ్యం2ను దసరా పండుగ కానుకగా అక్టోబర్ 13 న ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను డిస్నీ+హాట్‌స్టార్ కొనుగోలు చేసింది. ఈ సినిమాను సురేష్ బాబు, ఆంటోనీ పెరుంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి సంయుక్తంగా నిర్మించారు.



    దృశ్యం 2 చిత్ర బృందం షూటింగ్‌ను కేవలం 47 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేశారు. వెంకటేష్, మీనా జంటగా నటించారు. నదియా కీలకపాత్రలో కనిపించనుంది. మలయాళంలో ఒరిజినల్ వెర్షన్‌ని తెరకెక్కించిన జీతూ జోసెఫ్‌ తెలుగు వెర్షన్‌కి కూడా దర్శకత్వం వహించారు.

    Love Story Pre Release Event : నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అదిరిన చిరు, సాయి పల్లవిల డాన్స్ మూమెంట్స్..

    ఇక వెంకటేష్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్ర‌స్తుతం ఎఫ్3 సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఎఫ్ 2‌కు సీక్వెల్‌గా వస్తోంది. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తమన్నా, మెహ్రీన్, అంజలి ఇతర కీలక పాత్రలో కనిపించనున్నారు.

    Venkatesh : ఆర్తి అగర్వాల్ సహా వెంకటేష్ టాలీవుడ్‌కు పరిచయం చేసిన భామలు వీళ్లే..


    ఈ యేడాది వెంకటేష్ తమిళ సూపర్ హిట్ ‘అసురన్’ మూవీని ‘నారప్ప’గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా విడుదల చేసారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి కథానాయికగా నటించింది. ఇక తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన ‘అసురన్’ సినిమాలోని నటనకు గాను జాతీయ అవార్డును అందుకోవడం విశేషం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Drishyam 2, Jeethu Joseph, Meena, Suresh Babu, Suresh Productions, Tollywood, Venkatesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు