Venkatesh Wife Neeraja Reddy | విక్టరీ వెంకటేష్.. తెలుగు ఇండస్ట్రీలో సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. సొంత టాలెంట్‌తో..ఆయనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అయిన తండ్రి రామానాయుడు అండతో తొలి అడుగులు వేసినా... ఆతర్వాత తనదైన ప్రతిభతో మాస్, క్లాస్, ఫ్యామిలీ అన్నిరకాల ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుని విక్టరీ హీరోగా నిలిచారు వెంకటేశ్. అంతేకాదు హీరోగా 35 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇన్నేళ్ల కెరీర్‌లో అందరి హీరోల మాదిరి వెంకటేష్ తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి ప్రేక్షకులకు అంతగా తెలియనివ్వలేదు. ఆయన ఎక్కువగా పిల్లలతో పాటు భార్య నీరజా గురించి ఆయన ఎక్కడ కూడా ప్రస్తావించిన సందర్భాలు లేవు. అంతేకాదు ఆమెతో కలిసి ఎక్కడ పెద్దగా బయట కనిపించింది కూడా లేదు.
కానీ హీరోగా వెంకటేష్ విక్టరీల వెనకగా ఉంది మాత్రం అతని భార్య నీరజా రెడ్డి అని వెంకటేష్ సన్నిహిత వర్గాలు చెబుతుంటారు. గతేడాది రానా... మిహికా బజాజ్ అనే అమ్మాయిని ఇంటర్ క్యాష్ట్ మ్యారేజ్ చేసుకున్నాడని చెప్పుకుంటున్నారు. కానీ వెంకటేష్ నీరజా రెడ్డిని రెండున్నర దశాబ్దాల క్రితమే కులాంతర వివాహాం చేసుకొని ఆదర్శంగా నిలిచారు. నీరజా రెడ్డి ఫుట్టింటి విషయానికొస్తే.. ఈమెది ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లి. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న కుటుంబం వీరిది.
నీరజా రెడ్డి కూడా వెంకటేష్ మాదిరే.. విదేశాల్లో ప్రముఖ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసారు. ఆ తర్వాత ఇరు కుటుంబ పెద్దలు వెంకటేష్, నీరజా రెడ్డిల పెళ్లిని ఘనంగా జరిపించారు. నీరజా రెడ్డి ఎపుడు తన భర్త ఓ పెద్ద హీరో అనే విషయం అన్న సంగతి పట్టించుకోకుండా చాలా సింపుల్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తూ ఉంటోంది. ఎపుడు సినిమాలతో బిజీగా ఉంటారు వెంకటేష్. దీంతో కుటుంబ బాధ్యతలన్ని తనపై వేసుకొని అంతా చక్కదిద్దడం నీరజా రెడ్డి స్పెషాలిటీ.
Mohanlal: చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ తెలుగులో రీమేక్ చేసిన మోహన్‌లాల్ సినిమాలు ఇవే..
ఇప్పటికీ ఇంట్లో నలుగురు పిల్లల బాధ్యతలను తానే చూసుకుంటుంది. అంతేకాదు వారి చదువులో ఆమె పాత్రనే కీలకం. ప్రతి ఇంట్లో ఇల్లాలి పాత్రనే కీలకం అనే చెప్పాలి. అలా పెద్దింటి కోడలైనా ఒక సామాన్యురాలిగానే కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తోంది నీరజా రెడ్డి. ఇక వెంకటేష్ నటించిన ఏ సినిమాకు సంబంధించిన ఫంక్షన్స్‌కు ఈవెంట్స్‌కు ఆమె హాజరైన దాఖలాలు దాదాపు లేనే లేవనే చెప్పాలి.
Rajinikanth: వివిధ ఇండస్ట్రీ స్టార్ హీరోలతో రజినీకాంత్ చేసిన ఈ మల్టీస్టారర్ మూవీలు తెలుసా..
వెంకటేష్ విషయానికొస్తే.. ఈ యేడాది శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘నారప్ప’ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేసారు. ఆ తర్వాత మలయాళ ‘దృశ్యం 2’ మూవీని కూడా ఓటీటీ వేదికగా విడుదల చేసారు. ఈయన ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాను ‘ఎఫ్ 2’ మూవీకి సీక్వెల్. F3 మూవీని ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మరోసారి తమన్నా కథానాయికగా నటిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Drishyam 2, Narappa, Tollywood, Venkatesh