Venkatesh - Nagarjuna: వెంకటేష్‌‌ను ఆ విధంగా భయపెట్టిన నాగార్జున.. ఎంతవారు కానీ..

నాగార్జున, వెంకటేష్ (Twitter/Photo)

Venkatesh - Nagarjuna: టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్‌ను అక్కినేని నాగార్జున ఆ విధంగా భయపెట్డాడు. వివరాల్లోకి వెళితే.. 

  • Share this:
    Venkatesh - Nagarjuna: టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్‌ను అక్కినేని నాగార్జున ఆ విధంగా భయపెట్డాడు. వివరాల్లోకి వెళితే..  రీసెంట్‌గా నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ సినిమాను ముందుగా ఓటీటీలో విడుదల చేయాలనుకున్నారు. తీరా థియేటర్స్ ఓపెన్ కావడం.. క్రాక్, ఉప్పెన, జాతి రత్నాలు వంటి సినిమాలకు కలెక్షన్లు బాగా రావడంతో నాగార్జునతో పాటు నిర్మాత ఈ సినిమాను ఓటీటీలో కాకుండా థియేటర్స్‌లో విడుదల చేసారు. ఈ సినిమాకు టాక్ బాగున్నా.. ప్రేక్షకులు ఈ సినిమాను ఓటీటీలో వస్తే చూద్దాంలే అనుకొని లైట్ తీసుకున్నారు. ఇక ఈ సినిమాను రూ. 9 కోట్లకు అమ్మితే.. కనీసం రూ. 3.50 కోట్లు మాత్రమే రాబట్టి డబుల్ డిజాస్టర్‌గా నిలిచి హీరోగా నాగార్జున ఉనికిని ప్రశ్నించేలా చేసింది. మొత్తంగా ఓటీటీలో రిలీజ్ చేసి ఉంటే.. రూ. 22 కోట్ల అన్న దక్కేవి. ఓటీటీ డీల్ కాన్సిల్ చేసుకున్నందకు సగానికి సగం రేటుకే నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. దీంతో ఇపుడు వెంకటేష్ తను నటించిన తాజా చిత్రం ‘దృశ్యం 2’ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

    ఇక విక్టరీ వెంకటేష్... వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈయన హీరోగా తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన ‘అసురన్’ సినిమాను తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ చేసాడు. ఈ సినిమాను మే 14న థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు. దీంతో పాటు వెంకీ మామ..  ఓ మలయాళీ చిత్రాన్ని మరోసారి రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా చేసిన దృశ్యంను ఆయన ఇదివరకే తెలుగులో రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు.  తాజాగా  దృశ్యం 2ను రీమేక్ చేస్తున్నాడు. ఆల్రెడీ మళయాళంలో హిట్ అయిన ఈ చిత్రం పై మంచి అంచనాలు ఉన్నాయి. అక్కడ ఈ సినిమా థియేటర్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. మలయాళంలో దృశ్యం 2ను డైరెక్ట్ చేసిన అదే దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగులో కూడా తెరకెక్కిస్తున్నాడు.

    వైల్డ్ డాగ్‌లో నాగార్జున, దృశ్యం 2లో వెంకటేష్(Twitter/Photo)


    ఇప్పటికే వెంకటేష్ ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసారు. మిగిలిన పార్ట్ వారం పది రోజుల్లో పూర్తి చేసి ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేయనున్నారు. ఈ సినిమా 2014లో వచ్చిన దృశ్యంకు సీక్వెల్’గా వస్తోంది. ఈ సినిమాలో ట్విస్ట్‌లు, కథనం ప్రేక్షకుల్నీ కట్టిపడేశాయి. అనుకోకుండా జరిగిన ఓ మర్డర్ నుండి తన ఫ్యామిలీని ఎలా హీరో కాపాడుకున్నాడు అనేది కథ. ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ ప్రేక్షకులను తెగ ఆకట్టకుంది. ఇక ఈ దృశ్యం 2 సినిమాను తెలుగులో సురేష్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మిస్తున్నాడు. మీనా, వెంటకేష్ ప్రధాన పాత్రలు చేస్తుండగా.. నదియా మరో కీలకపాత్రలో కనిపించనుంది.

    Venkatesh - Drishyam 2 Telugu Remake Will Streming On OTT Platform Here Are The Details,Venkatesh - Drishyam 2: వెంకటేష్ ‘దృశ్యం 2’ ఓటీటీ విడుదల చేయనున్నారా.. ?,Venkatesh Drishyam 2 Telugu Remake Release on OTT Platform,Dirshyam 2 Telugu OTT Platform,Drishyam 2 telugu news, venkatesh drishyam 2 shooting, drishyam 2 telugu shooting, drishyam 2 telugu, venkatesh drishyam 2,venkatesh drishyam 2 remake,venkatesh drishyam 2 telugu remake,mohanlal venkatesh drishyam 2,venkatesh drishyam 2 jeethu joseph,venkatesh confirmed drishyam 2 remake,telugu cinema,దృశ్యం 2,దృశ్యం 2 తెలుగు రీమేక్,వెంకటేష్ దృశ్యం 2 తెలుగు రీమేక్,ఓటీటీలో విడుదల కానున్న దృశ్యం 2 మూవీ,ఓటీటీలో రిలీజ్ కానున్న వెంకటేష్ దృశ్యం 2
    ఓటీటీలో విడుదల కానున్న వెంకటేష్ దృశ్యం 2 Photo : Twitter


    తాజాగా ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా.. నేరుగా ఓటీటీ వేదికగా విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఓ ఓటీటీ సంస్థ  ఈ సినిమా కోసం రూ. 30 కోట్ల భారీ ఆఫర్ ప్రకటించినట్టు సమాచారం. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉంది. పైగా ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్స్‌కు వచ్చే సాహసం చేయడం లేదు. దీంతో చిత్ర నిర్మాత సురేష్ బాబు.. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ మూవీకి జరిగిన పరాభవం తన సినిమాకు ఎక్కడ జరుగుతోందో అని భయపడి .. ఇపుడు వెంకటేష్.. ముందు జాగ్రత్తగా తన సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: