హీరో వెంకటేశ్ పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో జరిగిన సంగతి తెలిసిందే. ప్రొఫెషనల్ బేకర్ అయిన ఆశ్రిత.. సోషల్ మీడియా Infinity Platter పేరుతో అకౌంట్‌ను మెయింటెన్ చేస్తున్నారు. ప్రస్తుతం భర్తతో కలిసి విదేశాల్లో ఉంటున్న ఆశ్రిత.. ఈ అకౌంట్ ద్వారా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ వెరైటీస్‌ను అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్ల ప్రశ్నలకు ఆశ్రిత సమాధానాలు ఇచ్చారు. తన గురించి నెటిజన్ల నుంచి అంచనాలను స్వీకరించిన అశ్రిత వాటికి నిజమా, కాదా అనే సమాధానాలు ఇచ్చింది. ఈ సందర్భంగా మీది లవ్ మ్యారేజ్ అంటూ ఎదురైన ప్రశ్నపై స్పందించారు. తనది లవ్ మ్యారేజ్ కాదని చెప్పారు. "నేను, నా భర్త ఒకే స్కూల్లో చదువుకున్నాం. చాలా కాలం నుంచి మా ఇద్దరికి పరిచయం ఉంది" అని సమాధానం ఇచ్చారు.
ఇంకా అశ్రిత సమాధానం చెప్పిన కొన్ని ప్రశ్నలు.. ప్రశ్న: మీరు కాఫీ అంటే ఇష్టపడతారా? ఆశ్రిత: నిజమే నేను కాఫీని చాలా ఇష్టపతాను. కానీ అది భయంకరమైన యాసిడిటీ ఇస్తుంది. అందుకే ఎక్కువగా తాగాను.
ఆశ్రిత (Image-Instagram)
ప్రశ్న: మీరు మిహీకాను(రానా భార్య) చాలా ఇష్టపడతారా? ఆశ్రిత: అవును
ప్రశ్న: మీ హైట్ 5'7? ఆశ్రిత: లేదు.. నా హైట్ 5'8 అండ్ హాఫ్
ప్రశ్న: మీరు మేకప్‌ను ఇష్టపడతారా? ఆశ్రిత: నేను ఎప్పుడు మేకప్ వేయలేదు. కానీ త్వరలోనే ఓ ప్రాజెక్టుతో రాబోతున్నాను.అందుకే సింపుల్ అండ్ న్యాచూరల్ మేకప్ ఎలా చేసుకోవాలో నేర్చుకుంటున్నాను.
ప్రశ్న: మీరు చాక్లెట్ ఇష్టపడతారా? ఆశ్రిత: భోజనం చేసిన తర్వాత నేను చాక్లెట్ కావాల్సిందే.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.