Venkatesh: వెంకటేష్ అభిమానులను కిక్ ఇచ్చే వీడియో.. పండగ చేసుకుంటున్న విక్టరీ హీరో ఫ్యాన్స్..

వెంకటేష్ (Venkatesh/File/Photo )

Venkatesh: వెంకటేష్ అభిమానులను కిక్ ఇచ్చే వీడియో.. పండగ చేసుకుంటున్న విక్టరీ హీరో ఫ్యాన్స్.. వివరాల్లోకి వెళితే..

  • Share this:
    Venkatesh: వెంకటేష్ అభిమానులను కిక్ ఇచ్చే వీడియో.. పండగ చేసుకుంటున్న విక్టరీ హీరో ఫ్యాన్స్.. వివరాల్లోకి వెళితే.. హీరోగా వెంకటేష్. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 35 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు.  సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. సొంత టాలెంట్ తో...తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో వెంకటేష్. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అయిన తండ్రి దగ్గుబాటి రామానాయుడు అండతో తొలిఅడుగులు వేసినా...తనదైన ప్రతిభతో మాస్, క్లాస్, ఫ్యామిలీ అన్నిరకాల ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుని విక్టరీ హీరోగా నిలిచారు వెంకటేష్. అంతేకాదు హీరోగా వెంకటేశ్ 35 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్ వెంకటేష్ నటించిన తొలి సినిమా నుంచి నారప్ప వరకు విక్టరీ హీరో నటించిన సినిమాలను ఓ స్పెషల్ వీడియోగా రిలీజ్ చేసింది.

    ఇందులో తొలి సినిమా ‘కలియుగ పాండవులు’ నుంచి ‘నారప్ప’ వరకు నటించిన సినిమాలు వరుస క్రమంలో ఉన్నాయి. ఈ వీడియో వెంకటేష్ అభిమానులకు నిజంగానే కిక్ ఇచ్చేలా ఉంది.

    దగ్గుబాటి వెంకటేశ్ విషయానికొస్తే.. ఈయన్ని విక్టరీ వెంకటేశ్ అంటేనే చాలామంది గుర్తుపడతారు. వారసత్వం తొలి అవకాశం మాత్రమే ఇస్తుంది.. కానీ ప్రతిభ ఉంటేనే తరువాత రాణించగలుగుతాం..అని నిరూపించిన హీరో వెంకటేశ్. టాలీవుడ్‌లో సక్సెఫుల్ ప్రొడ్యూసర్ అయిన తండ్రి అండతో ‘కలియుగ పాండవులు’ మూవీతో  తొలిఅడుగులు వేసినా...తనదైన ప్రతిభతో మాస్, క్లాస్, ఫ్యామిలీ అన్నిరకాల సినిమాలు చేసి  ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు.ఇప్ప‌టికీ వ‌ర‌స సినిమాల‌తో దూసుకుపోతూ స్టార్ హీరోగా స‌త్తా చూపిస్తూనే ఉన్నారు. టాలీవుడ్‌లో అప్పటి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునల సమకాలీన హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. 35యేళ్ల సినీ ప్రయాణంలో  70కి పైగా సినిమాలు చేసిన ఈ విక్టరీ కథానాయకుడు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉండటం విశేషం.

    ఇవి కూడా చదవండి.. 

    నందమూరి నట సింహా బాలకృష్ణ తన ఫిల్మీ కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..

    Sarkaru Vaari Paata - Pushpa : సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన మహేష్, బన్ని నిర్మాతలు..


    నాగ చైతన్య టూ సత్యదేవ్.. బాలీవుడ్‌లో బాట పడుతున్న టాలీవుడ్ హీరోలు..

    ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్‌కు రాజమౌళి మరో బిగ్ షాక్ ఇవ్వనున్నారా.. ?
    Published by:Kiran Kumar Thanjavur
    First published: