Home /News /movies /

Narappa | Venkatesh : ఫ్యాన్స్‌కు వెంకటేష్ క్షమాపణ.. ప్రత్యామ్నాయం లేకే ఇలా..

Narappa | Venkatesh : ఫ్యాన్స్‌కు వెంకటేష్ క్షమాపణ.. ప్రత్యామ్నాయం లేకే ఇలా..

Venkatesh Photo : Twitter

Venkatesh Photo : Twitter

Narappa | Venkatesh : వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమిళ సినిమా అసురన్‌కు తెలుగు రీమేక్‌గా వస్తున్న చిత్రం 'నారప్ప'.

    వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమిళ సినిమా అసురన్‌కు తెలుగు రీమేక్‌గా వస్తున్న చిత్రం 'నారప్ప'. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 20న విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు వెంకటేష్. ఆయన మాట్లాడుతూ.. నారప్ప ఓటీటీలో విడుదలవ్వడం తన అభిమానులను కాస్త నిరాశ పరిచిందని తెలిపారు. అయితే ఈ కొవిడ్ సమయంలో ప్రజలను చేరేందుకు ఇంతకన్న వేరే అవకాశం లేదని.. ఈ విషయంలో తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఈ కోవిడ్ కాలంలో తమకు ప్రత్యామ్నాయం లేనందున.. చివరగా OTT రిలీజ్‌ను ఎంచుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇక ఎప్పుడో షూటింగ్ జరపుకున్న ఈ సినిమా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో నారప్ప టీమ్ ఓటీటీ విడుదలను ఎంచుకుంది. అమెజాన్ నుంచి మంచి ఆఫర్ రావడంతో డైరెక్ట్‌గా డిజిటల్ రిలీజ్ కానుంది. ఈ సినిమా ఈనెల 20న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలకానుంది. వెంకటేష్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించారు. మణి శర్మ సంగీతం అందించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు.

    తమిళ అసురన్ సినిమాకు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఏమోషనల్ సీన్స్‌లో వెంకటేష్ అదరగొట్టారు. ఒరిజినల్ వెర్షన్ కి ఎక్కడా తగ్గకుండా శ్రీకాంత్ అడ్డాల టేకింగ్ కానీ చూపించిన విజువల్స్ కానీ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అలాగే వెంకటేష్, ప్రియమణిల నటన మరో ఎత్తుకు తీసుకెళ్తుందని చెప్పోచ్చు.



    ఇక ఈ సినిమా టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్‌.కె నాయుడు అందిస్తుండగా, సంగీతాన్ని మణిశర్మ అందిస్తున్నారు. ఎడిటర్ గా మార్తాండ్ కె. వెంకటేష్‌ పని చేస్తున్నారు. ఈ సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Hero venkatesh, Narappa

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు