వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా ఈనెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. హీరోగా మహేష్ బాబుకు ఇది 25వ సినిమా. అంతేకాదు ఈ సినిమాను వైజయంతి మూవీస్,శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా బ్యానర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సి.అశ్వనీదత్, దిల్ రాజు, పీవీపీ నిర్మించారు. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అల్లరి నరేష్ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ‘మహర్షి’ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరు పెంచిన ఈ సినిమా యూనిట్..తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నారు. ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మహేష్ బాబు వెరైటీగా ప్లాన్ చేసాడు. ఇప్పటి వరకు తన సినిమాలకు తానే స్పెషల్ గెస్ట్‌గా అటెండ్ అయ్యేవాడు. కానీ ‘భరత్ అను నేను’ సినిమా నుంచి మహేష్ బాబు రూటు ఛేంజ్ చేసాడు. ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యాడు. తాజాగా ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సీనియర్ హీరో వెంకటేష్‌తో పాటు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిలుగా హాజరవుతున్నారు.
ఇక వెంకటేష్..విషయానికొస్తే గత కొన్నేళ్లుగా వెంకటేష్ ముఖ్య అతిథిలుగా హాజరైన ‘మజిలీ’,‘జెర్సీ’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇపుడు ‘మహర్షి’ సినిమాకు హాజరు కానున్నారు. దీంతో సెంటిమెంట్ వర్కౌటై ‘మహర్షి’ సినిమాకు సూపర్ హిట్ అవుతుందని మహేష్ బాబు అభిమానులు అపుడే సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా ఈ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువనున్నాడు.
మహర్షి సినిమా స్టోరీ విషయానికొస్తే..ఈ సినిమాలో రిషి అనే సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు అతని స్నేహితుడిగా అల్లరి నరేష్ యాక్ట్ చేసాడు. స్నేహితుడి కోసం ఇండియాకు వచ్చిన మహేష్ బాబు..ఆ తర్వాత ఏం చేసాడనేది ‘మహర్షి’ సినిమా స్టోరీ. ఈ సినిమా రన్ టైమ్ దాదాపు 170 నిమిషాలున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే కదా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allari naresh, Ashwini Dutt, Dil raju, Maharshi, Maharshi Movie Review, Mahesh Babu, Mahesh Babu Latest News, Maheshbabu25, Pooja Hegde, PVP, Vamsi paidipally, Venkatesh, Vijay Devarakonda