ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌తో వస్తున్న ఎఫ్3 ట్రైలర్ అదిరిపోయింది. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన సినిమా 'ఎఫ్ 3'. సమ్మర్ సోగాళ్ళు... అనే బైలైన్‌తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదలైంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. మే 27న సినిమా ఎఫ్3 ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ట్రైలర్ విడుదలైన కాసేపటికే వేలల్లో వ్యూస్ వచ్చాయి. ఇక టాలీవుడ్ వెంకీ మామకు ఆయన ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
'ఎఫ్ 3' ట్రైలర్ చూస్తే... మురళీ శర్మ వాయిస్ ఓవర్ తో ప్రారంభం అయ్యింది. 'ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదు. ఆరో భూతం ఒకటి ఉంది. అదే డబ్బు' అని ఆయన డైలాగ్ చెప్పిన తర్వాత వెంకటేష్, వరుణ్ తేజ్ స్క్రీన్ మీదకు వచ్చారు. ఆ తర్వాత హీరోయిన్లు మెహరీన్, తమన్నాలను చూపించారు. 'డబ్బు ఉన్నవాడికి ఫన్, లేనివాడికి ఫ్రస్ట్రేషన్' అని మురళీ శర్మ నోటి నుంచి మరో డైలాగ్. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. రేచీకటి ఉన్న వ్యక్తిగా వెంకటేష్, నత్తి ఉన్న యువకుడిగా వరుణ్ తేజ్ నటన అదిరిపోయింది. ఇక పాన్ ఇండియ జూనియర్ ఆర్టిస్ట్ అంటూ వెన్నల కిశోక్, ఆలీ కామెడీ సీన్లు ఫన్ తెప్పించాయి. ఇక రఘుబాబు.. పంచ్ డైలాగ్స్ కూడా ట్రైలర్‌లో ఆకట్టకున్నాయి. డబ్బు చుట్టూ కథ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే మరోసారి కన్ఫర్మ్ అయ్యింది. వేసవిలో ఈ సినిమా మాంచి ఫన్ అందించేలా ఉంది.
ఇక ట్రైలర్ చూసిన ఫ్యాన్స్.. ట్రైలర్ చూశావా అనేలా కాకుండా ఎన్నిసార్లు చూశామా అన్నట్లుగా ఉందన్నారు. ఎఫ్2 కంటే బిగ్ హిట్ అవుతుందని... అప్పుడే జోస్యం చెప్పేస్తున్నారు ప్రేక్షకులు. 'ఎఫ్ 3' సినిమాలో వెంకటేష్ జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జంటగా మెహరీన్ నటించారు. సోనాల్ చౌహన్ ప్రత్యేక పాత్రలో, పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో నటించారు. ఇందులో సునీల్, ప్రగతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్ విడుదల చేశారు. 'లబ్ డబ్...', 'ఊ ఆ ఆహా ఆహా' సాంగ్స్ మంచి వ్యూస్ అందుకుంటున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు సమర్పణలో శిరీష్ ఎఫ్3ను నిర్మిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: F3 Movie, Mehreen Pirzada, Thamannah, Varun Tej, Victory venkatesh