Home /News /movies /

VENKATESH AND VARUN TEJ MOVIE F3 PRODUCERS MAKES A SUPERB DEAL AND ALREADY MAKING PROFITS MHN

F3 - Hero Venkatesh: విడుదలకు ముందే క్రేజీ డీల్ పూర్తి చేసుకున్న ఎఫ్ 3... నిర్మాతలకు అప్పడే లాభాలెంతో తెలుసా?

Venkatesh and Varun Tej Movie F3 producers makes a superb deal and already making profits

Venkatesh and Varun Tej Movie F3 producers makes a superb deal and already making profits

F3 - Hero Venkatesh: వెంక‌టేశ్-త‌మ‌న్నా, వ‌రుణ్‌తేజ్‌-మెహ‌రీన్ జోడీలుగా నటిస్తోన్న చిత్రం ఎఫ్3. 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఎఫ్2కి ఇది ఫ్రాంఛైజీ. షూటింగ్ దశలోనే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడయ్యాయి.

ఇంకా చదవండి ...
    విక్టరీ వెంకటేశ్ అభిమానులకు ఈ ఏడాది పండ‌గే ఎందుకంటే ఒక‌టి కాదు.. ఏకంగా రెండు సినిమాల‌తో సంద‌డి చేయ‌డానికి రెడీ అయిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ముందుగా విడుద‌లయ్యేది నార‌ప్ప‌. ఇది సీరియ‌స్ మూవీ. ఇక రెండో సినిమా ఎఫ్ 3. వెంక‌టేశ్ కెరీర్‌లో ది బెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఎఫ్‌2కు ఫ్రాంచైజీగా ఈ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఎఫ్ 2లో వెంక‌టేశ్-త‌మ‌న్నా, వ‌రుణ్‌తేజ్‌-మెహ‌రీన్ జోడీలు మ‌రోసారి న‌వ్వించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. చిన్న సినిమాల‌కు బిజినెస్ సంగ‌తి ఏమో కానీ.. పెద్ద సినిమాల‌కు బిజినెస్ ప‌రంగా డోకా ఉండ‌దు అని మ‌రోసారి ఎఫ్ 3 మూవీ ప్రూవ్ చేసింది. విడుద‌ల‌కు ముందే నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌ల‌కు రూ.24 కోట్లు లాభాన్ని తెచ్చి పెట్టిన‌ట్లు వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

    వివ‌రాల మేర‌కు అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఎఫ్ 3 తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ప‌న్ రైడ‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే డిజిటల్, శాటిలైట్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ సంస్థ చేజిక్కించుకుంద‌ట‌. ఆ సంస్థ ఏదో కాదు.. జీ స్టూడియోస్‌. డిజిట‌ల్ హ‌క్కుల‌కు రూ.12 కోట్లు, శాటిలైట్ హ‌క్కుల‌కు రూ.12 కోట్లు అంటే మొత్తంగా రూ.24 కోట్లు ఆదాయం దిల్‌రాజుకు వ‌చ్చేసింది. ఇక థియేట్రిక‌ల్ రైట్స్ విష‌యంలోనూ దిల్‌రాజు లాభాల‌ను సంపాదించుకుంటాడ‌న‌డంలో సందేహం లేదు.

    డ‌బ్బులు మీద భార్య‌లు ఎక్కువ‌గా ఆశ ప‌డి భ‌ర్త‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తే ఎలా ప‌రిణామాలు ఎదుర‌వుతాయ‌నే పాయింట్‌పై డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్లు తెలియ‌జేశాడు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఆగ‌స్ట్ 27న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రిగిపోతున్నాయి మ‌రి.
    Published by:Anil
    First published:

    Tags: Anil Ravipudi, F3 Movie, Venkatesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు