వెంకటేష్, వరుణ్ తేజ్‌లు మాయ చేసారుగా..రూ.100 కోట్ల క్లబ్బులో ఎంటరైన ‘F2’

విడుద‌లైన రోజు నుంచి బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో దూసుకుపోతుంది ‘ఎఫ్2’. ఇక ఇప్పుడు విడుద‌లైన రెండు వారాల త‌ర్వాత ఈ చిత్రం 100 కోట్ల క్ల‌బ్‌లోకి అడుగు పెట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు 62 కోట్లు షేర్ తీసుకొచ్చిన ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది.

news18-telugu
Updated: January 25, 2019, 12:01 PM IST
వెంకటేష్, వరుణ్ తేజ్‌లు మాయ చేసారుగా..రూ.100 కోట్ల క్లబ్బులో ఎంటరైన ‘F2’
వంద కోట్ల క్లబ్బులో ‘ఎఫ్2’
  • Share this:
విడుద‌లైన రోజు నుంచి బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో దూసుకుపోతుంది ‘ఎఫ్2’. ఇక ఇప్పుడు విడుద‌లైన రెండు వారాల త‌ర్వాత ఈ చిత్రం 100 కోట్ల క్ల‌బ్‌లోకి అడుగు పెట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు 62 కోట్లు షేర్ తీసుకొచ్చిన ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. వెంకటేశ్, వ‌రుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ చిత్రంపై ముందు నుంచి అంచ‌నాలు నిల‌బెడుతూ రోజురోజుకీ కలెక్ష‌న్ల సునామీ సృష్టిస్తూనే ఉంది. రెండో వారం కూడా మ‌రో సినిమా లేక‌పోవ‌డంతో దుమ్ము దులిపేసింది ఈ చిత్రం. తాజాగా ‘ఎఫ్ 2’ సినిమా రూ.100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టినట్టు ఈ చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది.

దానికితోడు సంక్రాంతి సినిమాల‌న్నీ కూడా ఒకేసారి మూకుమ్మ‌డిగా చేతులెత్తేయ‌డం కూడా ఎఫ్2 సినిమాకు క‌లిసొచ్చింది. దాంతో ఈ సినిమా మ‌రింత పండ‌గ చేసుకుంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు రోజుకు క‌నీసం 4 కోట్ల‌కు పైగానే షేర్ వ‌సూలు చేస్తుందంటే ఈ సినిమా దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఇప్పుడు ఏకంగా ఈ సినిమా 100 కోట్ల క్ల‌బ్‌లో చేరిపోయింది.

గ‌తేడాది మూడు సినిమాల‌తో పెద్ద‌గా అంచ‌నాలు అందుకోని దిల్ రాజుకు ఈ సినిమా లాభాల పంట పండిస్తుంది. ఇప్ప‌టికీ రెండో వారం కూడా ‘ఎఫ్2’ దుమ్ము దులిపేస్తుంది. మూడో వారంలో కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించే అవకాశం ఉంది. ‘ఎఫ్2’. మొత్తానికి ఫుల్ ర‌న్ పూర్త‌య్యే స‌రికి ఈజీగా 75 కోట్ల మార్క్ అందుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇదే గానీ జ‌రిగింది అంటే మాత్రం వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ అద్భుతం చేసిన‌ట్లే.

ఇవి కూడా చదవండి 

పుట్టినరోజున రవితేజ త్రిపుల్ ధమాకా..

వెంకటేష్ నెక్ట్స్ మల్టీస్టారర్ ఆ తమిళ స్టార్ హీరోతోనేనా..

బాలయ్య, బోయపాటి శ్రీను సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎపుడంటే...
First published: January 25, 2019, 11:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading