Venkatesh - Trivikram: త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వెంకటేష్ లాండ్ మార్క్ మూవీ.. త్వరలో అధికారిక ప్రకటన..

త్రివిక్రమ్, వెంకటేష్ (File/Photo)

Venkatesh - Trivikram: త్రివిక్రమ్ శ్రీనివాస్.. మాటల రచయత నుంచి దర్శకుడిగా మారిన తర్వాత ఎక్కువగా యంగ్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. తాజాగా వెంకటేష్ లాండ్ మార్క్ మూవీని త్రివిక్రమ్ డైరెక్ట్ చేయనున్నట్టు సమాచారం.

  • Share this:
    Venkatesh - Trivikram: త్రివిక్రమ్ శ్రీనివాస్.. మాటల రచయత నుంచి దర్శకుడిగా మారిన తర్వాత ఎక్కువగా యంగ్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. అందులో స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్స్‌తో మాత్రమే త్రివిక్రమ్ చేస్తూ వచ్చారు. తన మార్కు మాటలను జోడిస్తూ.. చాలా సేఫ్‌గా సినిమాలు చేశారు.  మధ్యలో నితిన్ లాంటి హీరోతో ‘అ..ఆ’ వంటి సినిమా చేసినా.. దాన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ తన పంథా మార్చుకోబోతున్నారు త్రివిక్రమ్. మధ్యలో చిరంజీవి.. ‘వినయ విధేయ రామ’ ఆడియో ఫంక్షన్‌లో మాటల మాంత్రికుడితో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ ఇంత వరకు అది కార్యరూపం దాల్చలేదు.

    పైగా త్రివిక్రమ్ వరుసగా సినిమాలకు కమిటైయ్యారు. మరోవైపు నిర్మాత టి.సుబ్బిరామిరెడ్డి కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్ చేయబోతున్నట్టు 2017 వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేసినా.. ఆ తర్వాత చడీ చప్పుడు లేదు. ప్రస్తుతం ఈ  మాటల మాంత్రికుడు వెంకటేష్‌తో ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కబోతున్నట్టు అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది కానీ అది వర్కౌట్ కాలేదు.

    వెంకటేష్,త్రివిక్రమ్ మూవీ అనౌన్స్‌మెంట్ చిత్రం (File/Photo)


    ప్రస్తుతం వెంకటేష్.. ‘నారప్ప’తో పాటు ‘దృశ్యం 2’ సినిమాలు కంప్లీట్ చేసారు. అంతా బాగుంటే ఈ శుక్రవారమే ‘నారప్ప’ సినిమా విడుదలై ఉండేది. ఇక వెంకటేష్.. నారప్ప 72వ సినిమా.. ‘దృశ్యం 2’ 73వ మూవీ.. ‘ఎఫ్ 3’ 74 చిత్రం. అందుకే తన లాండ్ మార్క్ మూవీ 75వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. మరోవైపు వెంకటేష్.. మలయాళంలో హిట్టైన ‘డ్రైవింగ్ లైసెన్స్’  సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేసారు.

    వెంకటేష్, త్రివిక్రమ్ మూవీ (Twitter/Photo)


    ఇక త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా ‘డ్రైవింగ్ లైసెన్స్’ మూవీ రీమేకా.. లేకపోతే.. హిందీలో హిట్టైన ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 2’ రీమేకా అని తెలియాల్సి ఉంది. ఇప్పటికే వెంకటేష్.. త్రివిక్రమ్‌తో ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 2’ సినిమా రీమేక్ చేయాలనుకున్నారు. ఎందుకో వర్కౌట్  కాలేదు. మరోవైపు వెంకటేష్.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘అజ్ఞాతవాసి’లో కాసేపు అతిథి పాత్రలో మెరిసారు. ఈ సన్నివేశాన్ని ఆ తర్వాత యాడ్ చేసిన సంగతి తెలిసిందే కదా.

    వెంకటేష్, త్రివిక్రమ్ (Twitter/Photo)


    వెంకటేష్ హీరోగా  త్రివిక్రమ్ రచయితగా 'మల్లీశ్వరి', 'నువ్వు నాకు నచ్చావ్' లాంటి సినిమాలకు పనిచేసింది తెలిసిందే. దర్శకుడిగా మారిన తర్వాత చాలా ఏళ్ళకు వెంకటేష్ హీరోగా తన దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు త్రివిక్రమ్. మరి వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎలా ఉండబోతుందనేది  చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: