హోమ్ /వార్తలు /సినిమా /

Venkatesh 75 : వెంకీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ విషయంలో తగ్గేదేలే అంటోన్న శైలేష్ కొలను..

Venkatesh 75 : వెంకీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ విషయంలో తగ్గేదేలే అంటోన్న శైలేష్ కొలను..

Venkatesh 75 Photo : Twitter

Venkatesh 75 Photo : Twitter

Venkatesh 75 : సీనియర్ హీరో వెంకటేష్ ఆ మధ్య ఎఫ్3తో వచ్చి తన కామెడీతో అలరించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత వెంకీ, రానాతో కలిసి రానా నాయుడు అనే ఓ వెబ్ సిరీస్‌‌ను చేస్తున్నారు. ఇటీవల ఈ వెబ్ సిరీస్‌ టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక అది అలా ఉంటే వెంకీ తన కొత్త సినిమాను ప్రకటించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

విక్టరీ వెంకటేష్ (Venkatesh ) ఆ మధ్య ఎఫ్3తో వచ్చి తన కామెడీతో అలరించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత వెంకీ, రానాతో కలిసి రానా నాయుడు (Rana Naidu) అనే ఓ వెబ్ సిరీస్‌‌ను చేస్తున్నారు. విడుదలకు రెడీ అయిన ఈ వెబ్ సిరీస్‌ నుంచి ఇటీవల టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక అది అలా ఉంటే వెంకీ తన కొత్త సినిమాను ప్రకటించారు. యువ దర్శకుడు శైలేష్ కొలను(Sailesh Kolanu)తో ఓ సినిమాను ప్రకటించారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తున్నట్లు తెలుస్తోంది. హిట్ (Hit) సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్‌లో వచ్చిన రెండు చిత్రాలు బాగానే హిట్ అయ్యాయి. వెంకీమామ కెరీర్‌లో 75వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విశేషాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాను నాని‌తో శ్యామ్ సింగ రాయ్ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి, విజయాన్ని అందుకున్న వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మిస్తున్నారు.

అది అలా ఉంటే ఈ చిత్రం నుంచి ఓ గ్లింప్స్‌ను విడుదల చేయనుంది టీమ్. భారీ బడ్జెట్ చిత్రంగా వస్తోన్న ఈ చిత్రం నుంచి ఓ చిన్నపాటి టీజర్‌ను విడుదల చేయనున్నారట చిత్రబృందం. వెంకీ 75కు సంబంధించిన గ్లింప్స్‌ను రేపు ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. వెంకీ 75వ సినిమా కావడంతో ఓ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్, టెక్నీషియన్స్ త్వరలో ప్రకటించనుంది టీమ్.

ఇక వెంకటేష్ సినిమాల విషయానికి వస్తే.. వెంకటేష్ ఇటీవల యువ హీరో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ఓరి దేవుడాలో ఓ కీలకపాత్రలో కనిపించారు. ఈ సినిమా అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. ఇక వెంకీ అంతకు ముందు ఎఫ్ 3 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా ఎఫ్2కు సీక్వెల్‌గా వచ్చింది. అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు ముందు వెంకీ నారప్ప, దృశ్యం2 వంటి సినిమాలతో ముందుకొచ్చారు. అయితే ఈ సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందాయి.

Here comes the BLAST of an Update ????

Extremely Proud & Privileged to announce that, Our Prestigious ???????????????????????????????????????? ???????? 2 is Victory @VenkyMama’s Land Mark Film #Venky75 ????????

Directed by @KolanuSailesh

Produced by @vboyanapalli

Announcement on JAN 25th 2023❤️‍???? pic.twitter.com/EL3T4c78g8

— Niharika Entertainment (@NiharikaEnt) January 23, 2023

ఇక వెంకటేష్ నటిస్తున్న వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ విషయానికి వస్తే.. ఈ వెబ్ సిరీస్‌ హిందీతో పాటు తెలుగు, తమిళంతోపాటు ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌లో  వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించారు. గతంలో వీళ్లిద్దరు  ‘కృష్ణం వందే జగద్గురుమ్’  సినిమాలో ఓ పాటలో దగ్గుబాటి బాబాయి అబ్బాయి కలిసి నటించారు. కానీ వీళ్లిద్దరు పూర్తి స్థాయిలో మాత్రం నటించలేదు. ఇపుడు ఆ కోరిక ఈ వెబ్ సిరీస్‌తో నెరవేరబోతుంది.  మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్ లాంటి సిరీస్‌లకు పనిచేసిన సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేసారు. థ్రిల్లర్ ఎలిమెంట్‌తో వెంకటేష్, రానా నెట్‌ప్లిక్స్‌లో సందడి చేయనున్నారు.

ఇక దర్శకుడు శైలేష్ కొలను విషయానికి వస్తే.. మంచి అంచనాల నడుమ వచ్చిన హిట్ 2 సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో  అదరగొట్టింది.. థియేట్రికల్ రన్ పూర్తి అవ్వడంతో ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. హిట్ యూనివర్స్ మూడో సినిమా హిట్3 త్వరలో రానుంది. ఈ సినిమాలో నాని హీరోగా నటిస్తున్నారు. త్వరలో షూటింగ్‌కు వెళ్లనుంది.

First published:

Tags: Tollywood news, Venkatesh

ఉత్తమ కథలు