వెంక‌ట్ ప్ర‌భు ‘పార్టీ’ టీజ‌ర్.. ఫుల్ హ్యాంగోవ‌ర్..

వెంక‌ట్ ప్ర‌భు సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రేక్ష‌కుల‌కు కూడా ఓ ఐడియా ఉంటుంది. ఆయ‌న సినిమాల్లో క‌థ కంటే ముఖ్యంగా కామెడీ ఉంటుంది. ఫుల్లుగా పార్టీ మూడ్ ఉన్న సినిమాలే చేస్తుంటాడు వెంక‌ట్ ప్ర‌భు. ఇప్పుడు కూడా ఇలాంటి సినిమాతోనే వస్తున్నాడు ఈ దర్శకుడు. పార్టీ అంటూ పక్కా జాయ్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. ఈ చిత్ర టీజర్ విడుదలైందిప్పుడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 13, 2018, 6:55 PM IST
వెంక‌ట్ ప్ర‌భు ‘పార్టీ’ టీజ‌ర్.. ఫుల్ హ్యాంగోవ‌ర్..
పార్టీ మూవీ పోస్టర్
  • Share this:
వెంక‌ట్ ప్ర‌భు సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రేక్ష‌కుల‌కు కూడా ఓ ఐడియా ఉంటుంది. ఆయ‌న సినిమాల్లో క‌థ కంటే ముఖ్యంగా కామెడీ ఉంటుంది. ఫుల్లుగా పార్టీ మూడ్ ఉన్న సినిమాలే చేస్తుంటాడు వెంక‌ట్ ప్ర‌భు. "గోవా".. "చెన్నై 600028".. "సరోజా".. "మంగ‌త్త‌".. "బిర్యానీ" లాంటి సినిమాల‌న్నీ అలా వ‌చ్చిన‌వే. సూర్య‌తో చేసిన "రాక్ష‌సుడు" మాత్ర‌మే ఫ్లాప్ అయింది. ఆ వెంట‌నే "చెన్నై 600028" సీక్వెల్‌తో హిట్ కొట్టాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇక ఇప్పుడు "పార్టీ" అంటూ మ‌రో ఎంట‌ర్‌టైనర్‌తో వ‌స్తున్నాడు.

త‌న‌కు అచ్చొచ్చిన గోవాలోనే షూటింగ్ అంతా పూర్తి చేసాడు. వెంక‌ట్ ప్ర‌భు ఆస్థాన హీరోలు జై.. మిర్చి శివ‌ ఇందులో న‌టిస్తున్నారు. ఇక రెజీనా, నివేదా పేతురాజ్ లాంటి ముద్దుగుమ్మ‌లు బికినీల‌తో అందాలు ఆర‌బోసారు. స‌త్య‌రాజ్, జ‌యరాం లాంటి సీనియ‌ర్ న‌టులు కూడా క‌మెడియ‌న్లుగా మారిపోయారు. ఇప్పుడు విడుద‌లైన టీజ‌ర్ కూడా ఫుల్ పార్టీ మూడ్‌లోనే ఉంది.


ఇది చూసిన త‌ర్వాత సినిమా ఎలా ఉండ‌బోతుందో కూడా క్లారిటీ వ‌చ్చేసింది. ర‌మ్య‌కృష్ణ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది. ఇదే ఏడాది డిసెంబ‌ర్లో "పార్టీ" రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. తెలుగులోనూ ఈ చిత్రం విజ‌యం సాధిస్తుంద‌ని ధీమాగా చెబుతున్నాడు వెంక‌ట్ ప్ర‌భు. మ‌రి చూడాలిక‌.. పార్టీ హ్యాంగోవ‌ర్ ప్రేక్ష‌కుల‌కు ఎంత‌వ‌ర‌కు ఎక్కుతుందో..?

First published: November 13, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు