Vinaro Bhagyamu Vishnu Katha Teaser Talk | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు (Bunny Vas) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఇక వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హ్యాపెనింగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటిస్తున్నారు. ఈయన సరస కశ్మీర పర్ధేశీ నటిస్తోంది. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాతో మురళి కిషోర్ అబ్బురూ దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ప్రఖ్యాత దర్శకులు ప్రశాంత్ నీల్, కిషోర్ తిరుమల దగ్గర మురిళి కిషోర్ గతంలో పని చేశారు. జులై 15న హీరో కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు సందర్భంగా 'వినరో భాగ్యము విష్ణుకథ' టీజర్ విడుదల చేసారు మేకర్స్. ఇప్పటికే గుడి ముందు డు డు బసవన్నతో లుంగీ కట్టుకొని పర్ఫెక్ట్ మాస్ లుక్‌లో ఉన్న పోస్టర్ అందరినీ అలరిస్తోంది. తాజాగా విడుదల చేసిన టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ టీజర్లో నా పేరు విష్ణు.. మా ఊరు తిరుపతి..మరికొన్ని రోజుల్లో మీరు చూడబోయేదే నా కథ.. ఇప్పుడు నా కథ ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసా.. అని కిరణ్ అబ్బవరం చెబుతుండగానే.. హ్యాపీ బర్త్ డే విష్ణు అంటూ టీజర్ ముగుస్తుంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది.
Wishing a very happy Birthday to our '????????????????????????' @Kiran_Abbavaram - Team #VinaroBhagyamuVishnuKatha ????#VibeOfVBVK out now ▶️ https://t.co/dNaIDm27RQ #AlluAravind #BunnyVas @kashmira_9 @KishoreAbburu @chaitanmusic #MarthandaKVenkatesh @daniel_viswas @imsarathchandra pic.twitter.com/KtAuqZXpHE
— BA Raju's Team (@baraju_SuperHit) July 14, 2022
ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం లుక్ మాస్ ఆడియన్స్ తో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. పిల్లా నువ్వు లేని జీవితం, భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, చావు కబురు చల్లగా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లాంటి అద్భుతమైన విజయాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా ఇది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ అందిస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా బాబు వ్యవహరిస్తున్నారు. సత్యగమిడి, శరత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాతలు. సెప్టెంబర్ 30న విడుదల కానుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా విడుదల అవ్వనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kiran abbavaram, Tollywood, Vinaro Bhagyamu Vishnu Katha