సెట్స్ పైకి వెళ్లిన వరుణ్ తేజ్ ‘వాల్మీకీ’ మూవీ..

‘ఎఫ్ 2’ తర్వాత వరుణ్ తేజ్..హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకీ’ సినిమాకు ఓకే చెప్పాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈ రోజే ప్రారంభమైంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 18, 2019, 1:02 PM IST
సెట్స్ పైకి వెళ్లిన వరుణ్ తేజ్ ‘వాల్మీకీ’ మూవీ..
వరుణ్ తేజ్ వాల్మీకి సినిమా
  • Share this:
గత కొన్నేళ్లగుగా వరుణ్ తేజ్..వరసగా  క్రేజీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా వున్నాడు. ఏడాదిన్నర క్రితం ‘ఫిదా’ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కిన వరుణ్ తేజ్...ఆ తర్వాత ‘తొలిప్రేమ’తో మరో సక్సెస్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత స్పేస్ నేపథ్యంలో చేసిన ‘అంతరిక్షం’ ఫ్లాపైనా..ఆ వెంటనే సీనియర్ హీరో వెంకటేష్‌తో చేసిన ‘ఎఫ్ 2’ తో కెరీర్‌లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో వరుణ్ క్యారెక్టర్‌లో మెగా హీరో పండించిన కామెడీ..తెలంగాణ యాస ఆడియన్స్‌ను ఫిదా చేసింది. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో తమిళంలో హిట్టైన ‘జిగర్తాండ’ సినిమాను తెలుగులో ‘వాల్మీకీ’ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా టైటిల్‌‌ లోగోలో గన్ ఉండటంతో  ఒక వర్గం ప్రజలు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. ఎపుడో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజే ప్రారంభమైంది. ఈ షూటింగ్ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చేస్తున్నట్టు వరుణ్ తేజ్ తన  ట్వీట్‌లో తెలిపాడు.

ఈ సినిమాలో వరుణ్ తేజ్.,.ప్రతినాయక ఛాయలున్న పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాతో అథర్వ మురళి అనే నటుడు తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు.

varun tej,harish shankar's valmiki shooting starts today,varun tej,varun tej twitter,varun tej instagram,varun tej valmiki shooting starts,varun tej harish shankar valmiki,varun tej new movie,varun tej movies,varun tej valmiki movie,varun tej valmiki,valmiki,varun tej movie updates,varun tej movie first look,hero varun tej new movie,valmiki movie,hero varun tej,varun tej new movie opening,hero varun tej new movie opening video,#valmiki,varun tej valmiki updates,hero varun tej new movie with harish shankar,valmiki movie launch,varun tej niharika,nagababu,jabardasth comedy show,tollywood,telugu cinema,ap news,tamilnadu elections,prabhas instagram,వరుణ్ తేజ్,వరుణ్ తేజ్ ట్వీట్,వరుణ్ తేజ్ ట్విట్టర్,వరుణ్ తేజ్ వాల్మీకీ మూవీ షూటింగ్ ప్రారంభం,వాల్మీకీ షూటింగ్ ప్రారంభం,వరుణ్ తేజ్ హరీష్ శంకర్,హరీష్ శంకర్ వాల్మీకీ షూటింగ్ ప్రారంభం,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
వాల్మీకి సినిమా ఓపెనింగ్


ఈసినిమాలో మృణాలినీ రవి హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్..కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో  బాక్సర్‌గా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 18, 2019, 1:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading