వ‌రుణ్ తేజ్‌కు పోటీగా మెగాస్టార్.. వారసుడు త‌ట్టుకుంటాడా..?

వ‌రుణ్ తేజ్ "అంత‌రిక్షం" విడుద‌ల అవుతున్న డిసెంబ‌ర్ 21నే మెగాస్టార్ సినిమా కూడా రానుంది. సంక‌ల్ప్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో లావ‌ణ్య త్రిపాఠి, అదితిరావ్ హైద్రీ న‌టిస్తున్నారు. ఈ సమరంపై ఇప్పుడు ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటుంది. మెగాస్టార్ సినిమాను వరుణ్ తేజ్ ఎలా తట్టుకుంటాడనేది ఆసక్తికరమే.

news18-telugu
Updated: September 12, 2018, 9:58 PM IST
వ‌రుణ్ తేజ్‌కు పోటీగా మెగాస్టార్.. వారసుడు త‌ట్టుకుంటాడా..?
వరుణ్ తేజ్ ఫైల్ ఫోటో
  • Share this:
అవును.. మీరు చ‌దివింది నిజ‌మే. నిజంగానే ఇప్పుడు వ‌రుణ్ తేజ్‌కు పోటీగా మెగాస్టార్ వ‌స్తున్నాడు. అదేంటి.. మెగాస్టార్ న‌టిస్తున్న "సైరా" ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోలేదు క‌దా.. అప్పుడే వార‌సుడికి ఎలా పోటీగా వ‌స్తాడు అనుకుంటున్నారా..? వ‌స్తున్నాడు.. ఇప్పుడు విడుద‌ల తేదీ కూడా క‌న్ఫ‌ర్మ్ చేసారు. వ‌రుణ్ తేజ్ "అంత‌రిక్షం" విడుద‌ల అవుతున్న డిసెంబ‌ర్ 21నే మెగాస్టార్ సినిమా కూడా రానుంది. సంక‌ల్ప్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో లావ‌ణ్య త్రిపాఠి, అదితిరావ్ హైద్రీ న‌టిస్తున్నారు.

వ‌రుణ్ తేజ్‌కు పోటీగా మెగాస్టార్.. వారసుడు త‌ట్టుకుంటాడా..? varun tej war with megastar..
అంతరిక్షం సినిమాలో వరుణ్ తేజ్(ట్విట్టర్ ఫోటో)


వ‌రుణ్ తేజ్‌కు పోటీగా వ‌స్తున్న మెగాస్టార్ ఇక్క‌డ చిరంజీవి కాదు.. మ‌మ్ముట్టి. ఈయ‌న కూడా మెగాస్టారే.. కాక‌పోతే మ‌ళ‌యాల సినిమాకు మ‌మ్మ‌ట్టి మెగాస్టార్. ఈయ‌న న‌టిస్తున్న "యాత్ర" సినిమా డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది. జ‌గ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అదే రోజు ఈ సినిమా విడుద‌ల కానుంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్నాయి క‌దా.. అందుకే ఇప్పుడు యాత్ర అనే ప‌దం బాగా ట్రెండింగ్ అయిపోయింది. ఎవ‌రికి వాళ్లు అధికారంలోకి రావ‌డానికి యాత్ర‌ను బాగా వాడుకుంటున్నారు. ఇప్పుడు జ‌గ‌న్ కూడా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఉన్నాడు. ఒక‌ప్పుడు ఆయ‌న తండ్రి వైఎస్సార్ కూడా ఈ పాద‌యాత్ర‌తోనే ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కాడు.

వ‌రుణ్ తేజ్‌కు పోటీగా మెగాస్టార్.. వారసుడు త‌ట్టుకుంటాడా..? varun tej war with megastar..
యాత్ర ఫోటో
ఇప్పుడు ఈ నేప‌థ్యంలోనే "యాత్ర" సినిమా తెర‌కెక్కుతుంది. ఈయ‌న మ‌న‌కు భౌతికంగా దూర‌మై 9 ఏళ్లు అయినా కూడా ఇప్ప‌టికీ రాజ‌శేఖ‌రుడిపై ప్రేమ మాత్రం అలాగే ఉంది. ఇప్ప‌టికీ ఆయ‌నంటే అంతే ప్రేమ చూపిస్తున్నారు. దాన్ని క్యాష్ చేసుకుంటూ వ‌స్తున్న సినిమా "యాత్ర‌". మ‌హి వి రాఘ‌వ్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్ర టీజ‌ర్ ఆ మ‌ధ్య విడుద‌లైంది. దీనికి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది.
వ‌రుణ్ తేజ్‌కు పోటీగా మెగాస్టార్.. వారసుడు త‌ట్టుకుంటాడా..? varun tej war with megastar..
యాత్ర పోస్టర్


మొన్న వైఎస్ వ‌ర్ధంతికి విడుద‌లైన పాట‌కు కూడా రెస్పాన్స్ బాగుంది. ఇందులో వైఎస్ఆర్ పాత్ర‌లో మ‌మ్ముట్టి న‌టిస్తుండ‌టంతో సినిమాపై ఆస‌క్తి.. అంచ‌నాలు రెండూ రెండింత‌లు అయ్యాయి. ఆయ‌న్ని ఒప్పించి ఈ పాత్ర చేయించిన‌పుడే ద‌ర్శ‌కుడు సగం విజ‌యం సాధించాడు.
Loading...
వ‌రుణ్ తేజ్‌కు పోటీగా మెగాస్టార్.. వారసుడు త‌ట్టుకుంటాడా..? varun tej war with megastar..
అంతరిక్షం పోస్టర్


ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌.. వ‌స్తున్న స్టిల్స్.. లుక్స్ చూస్తుంటే "యాత్ర" క‌చ్చితంగా ఏదో మాయ చేసేలా క‌నిపిస్తుంది. అచ్చంగా ఆ వైఎస్ మాదిరే త‌న‌ను తాను మార్చుకున్నాడు ఈ హీరో. ఇది వైఎస్ బ‌యోపిక్ కాదు.. 2003-04 మ‌ధ్య‌లో ఆయ‌న చేసిన పాద‌యాత్ర‌.. దానికి సంబంధించిన క‌థ‌. మొత్తానికి అటు వ‌రుణ్ తేజ్.. ఇటు మ‌మ్ముట్టి మ‌ధ్య వార్ ఓ రేంజ్‌లో ఉంటుంద‌ని ఆశిస్తున్నారు అభిమానులు. మ‌రి ఈ వార్ ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌..!
First published: September 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...