‘వాల్మీకి’ టీజర్.. వరుణ్ తేజ్ రావణావతారం.. విలన్‌గా రుద్రతాండవం..

ఇప్పుడు వాల్మీకి టీజ‌ర్ చూసిన త‌ర్వాత అంతా ఇదే అంటారు. తెలుగు ఇండ‌స్ట్రీ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త పుంత‌లు తొక్కుతూనే ఉంది. ఈ క్రమంలోనే మరో భిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు వరుణ్ తేజ్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 15, 2019, 6:55 PM IST
‘వాల్మీకి’ టీజర్.. వరుణ్ తేజ్ రావణావతారం.. విలన్‌గా రుద్రతాండవం..
వాల్మీకి పోస్టర్ (Source: Twitter)
  • Share this:
ఇప్పుడు వాల్మీకి టీజ‌ర్ చూసిన త‌ర్వాత అంతా ఇదే అంటారు. తెలుగు ఇండ‌స్ట్రీ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త పుంత‌లు తొక్కుతూనే ఉంది. ఈ క్రమంలోనే మరో భిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు వరుణ్ తేజ్. ఇప్పుడు విడుదలైన వాల్మీకి టీజర్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉంటుందో అర్థమైపోతుంది. కచ్చితంగా ఈ చిత్రంతో వరుణ్ తేజ్ సంచలనాలు రేపడం ఖాయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వరుణ్ లుక్స్.. ఆయన నటన సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. హరీష్ శంకర్ మంచి కసితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని టీజర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. పైగా వరుణ్ గెటప్ మరో స్థాయిలో ఉంది. ఈ చిత్రం త‌మిళ‌నాట హిట్ అయిన జిగ‌ర్తాండ సినిమాకు రీమేక్.

ఇందులో నెగిటివ్ కారెక్ట‌ర్ చేస్తున్నాడు వ‌రుణ్ తేజ్. త‌మిళ హీరో అథ‌ర్వ ముర‌ళి మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్. డిజే త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇప్పుడు విడుద‌లైన టీజ‌ర్లో వ‌రుణ్ తేజ్ మ‌రీ రాక్ష‌సంగా క‌నిపిస్తున్నాడు. ఈయ‌న లుక్ చూసి నిజంగానే భ‌యం వేస్తుంది. మ‌రి రేపు సినిమాలో ఇంకెలా ఉంటాడో..? ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల కానుంది. ఆ రోజే నాని గ్యాంగ్ లీడర్ కూడా వస్తుంది. ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2 లాంటి సినిమాల తర్వాత వరుణ్ చేస్తున్న సినిమా ఇది.

First published: August 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు