• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • VARUN TEJ TO WORK WITH NITHIIN BHEESHMA DIRECTOR VENKY KUDUMULA FOR HIS NEXT HERE ARE THE DETAILS SR

Varun Tej : బ్లాక్ బస్టర్ దర్శకుడితో మెగాప్రిన్స్​ వరుణ్ తేజ్ కొత్త సినిమా​..

Varun Tej : బ్లాక్ బస్టర్ దర్శకుడితో మెగాప్రిన్స్​ వరుణ్ తేజ్ కొత్త సినిమా​..

వరుణ్ తేజ్ Photo : Twitter

Varun Tej : మెగా హీరో​ వరుణ్​ తేజ్​ ప్రస్తుతం గని అనే ఓ స్పోర్ట్స్ డ్రామాను చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

  • Share this:
    మెగా హీరో​ వరుణ్​ తేజ్​ ప్రస్తుతం గని అనే ఓ స్పోర్ట్స్ డ్రామాను చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. వరుణ్ ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎఫ్ 3లో కూడా నటిస్తున్నాడు. ఎఫ్ 3లో వరుణ్‌కు జంటగా మెహ్రీన్ నటిస్తుండగా.. మరో జంటగా వెంకటేష్ తమన్నాలు నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలతో బీజీగా ఉన్న వరుణ్ తన మూడో సినిమాకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. నాగ శౌర్యతో చలో, నితిన్‌తో 'భీష్మ' ను తీసి మంచి విజయం అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో వరుణ్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇటీవలే ఆ డైరెక్టర్ చెప్పిన​ స్టోరీలైన్​ విన్న వరుణ్​.. నచ్చి వెంటనే కథకు ఓకే చెప్పినట్లు సమాచారం అందుతోంది. దీంతో డైరెక్టర్​ పూర్తి స్క్రిప్టును సిద్ధం చేస్తున్నారని.. త్వరలోనే షూటింగ్​ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే గని దాదాపు పూర్తవ్వడంతో అన్ని కుదిరితే 'ఎఫ్​ 3' షూటింగ్​ పూర్తి అయిన వెంటనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది.

    ఇక వరుణ్ ప్రస్తుతం నటిస్తున్న గని సినిమా విషయానికి వస్తే.. మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్లో నటిస్తూ కథల ఎంపిక విషయంలో కొత్తదనం చూపిస్తూ టాలీవుడ్‌లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ గని అనే సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ బ్యాగ్ డ్రాప్‌లో వస్తోన్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. వరుణ్ మొదట్లో కథల విషయంలో తడబడ్డ.. ఆ తర్వాత మూస కథలతో వచ్చే సినిమాలను పక్కన పెట్టిన వరుణ్ కొత్తరకం కథలను ఎంచుకోవడం చేయడం మొదలు పెట్టాడు. దీంతో వరుస విజయాలను వరుణ్ సొంతం చేసుకుంటున్నాడు. ఈ చిత్రం కోసం వరుణ్ ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకున్నాడు. ఈ సినిమా దాదాపు రూ.35 కోట్లతో భారీగా తెరకెక్కుతోంది. వరుణ్‌కు జోడిగా ప్రముఖ హిందీ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వరుస చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని ప్రకటించింది.

    అయితే ఇక్కడ ఓ సమస్య వచ్చింది. అది ఏమంటే.. ప్రభాస్ ప్యాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ కూడా ఇదే రోజు విడుదలకానుంది. దీంతో ఒకే రోజు రెండు సినిమాలు అంటే ఇటు థియేటర్స్‌కు కష్టమే.. దీంతో పాటు కలెక్షన్స్ కూడా తగ్గుతాయి. దీంతో వరుణ్ తేజ్ గని ఈ విషయంలో ఓ నిర్ణయానికి వస్తున్నాడని సమాచారం. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే.. వరుణ్ తేజ్ ప్రకటించిన కొన్నిరోజులకు రాధేశ్యామ్ టీమ్ తమ సినిమా విడుదల తేది ప్రకటించింది. చూడాలి మరి ఏమౌతుందో..
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు