మెగా బ్రదర్ నాగబాబు చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. ఇటీవలే తన చిట్టి తల్లి నిహారికకు ఘనంగా వివాహం చేసిన సంగతి తెలిసిందే. ఈ పెళ్ళి వేడుకలో మెగా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర చేరి సందడి చేశారు. ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా మూడు రోజుల పాటు పెళ్ళి ఘనంగా జరిగింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ కరోనా సోకడంతో కొంత ఆందోళన చెందగా త్వరగానే అతను కొలుకొవడంతో ఊపీరి పీల్చుకుంది. చాలా రోజుల తర్వాత నాగబాబు ఫ్యామిలీతో కలిసి సరాదగా గడిపారు. పెళ్ళి అయినప్పటి నుంచి అత్తవారింట్లో ఉన్న నిహారిక తన పుట్టింటికి వచ్చి్ంది. ఈ సందర్భంగా వారు నలుగురు కలిసి దిగిన ఓ ఫోటో నెట్టింట్లో హాల్‌చల్ చెస్తుంది. అయితే త్వరలోనే వరుణ్ తేజ్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తో్ంది. చాలా ఓ అమ్మాయితో వరుణ్ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఆ అమ్మాయినే అతడు వివాహాం చేసుకోనున్నట్లు సన్నిహితులు చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
La familia! pic.twitter.com/Q6rxBwFoUL
— Varun Tej Konidela ? (@IAmVarunTej) January 23, 2021
ఇక ఫ్యామిలీ రిలాక్డ్స్ మూడ్‌లో ఉన్న ఓ ఫోటోను వరుణ్ తేజ్ తన సోషల్ మీడియాలో షేరు చేశారు. తల్లి,తండ్రి నాగబాబు, చెల్లి నిహారిక తో కలిసి ఆ ఫొటో దిగారు. అందులో అందరూ చాలా ఖుషి.. ఖుషిగా కనిపిస్తున్నారు. కుటుంబం ముసిముసి నవ్వులు నవ్వుతూ ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం వరుణ్ ఎఫ్ 3 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Niharika konidela, Ram Charan, Varun Tej