పవన్ కల్యాణ్ ఫ్లాప్ సినిమా రీమేక్‌లో వరుణ్ తేజ్.. షాక్‌లో ఫ్యాన్స్..?

అవునా.. ఇదెప్పుడు జరగబోతుంది.. రీమేక్ చేస్తే హిట్ సినిమాను తీసుకుంటారు కదా.. ఫ్లాప్ సినిమా తీసుకోవడం ఏంటి అనుకుంటున్నారా..? ప్రస్తుతం ఇండస్ట్రీలో అయితే ఇలాంటి వార్తలే వినిపిస్తున్నాయి.. వరుణ్ తేజ్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 6, 2019, 8:02 AM IST
పవన్ కల్యాణ్ ఫ్లాప్ సినిమా రీమేక్‌లో వరుణ్ తేజ్.. షాక్‌లో ఫ్యాన్స్..?
పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్
  • Share this:
అవునా.. ఇదెప్పుడు జరగబోతుంది.. రీమేక్ చేస్తే హిట్ సినిమాను తీసుకుంటారు కదా.. ఫ్లాప్ సినిమా తీసుకోవడం ఏంటి అనుకుంటున్నారా..? ప్రస్తుతం ఇండస్ట్రీలో అయితే ఇలాంటి వార్తలే వినిపిస్తున్నాయి.. వరుణ్ తేజ్ కమిటైన సినిమా చూస్తుంటే ఇదే అనుమానాలు వస్తున్నాయి. గతేడాది పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా టైటిల్ వాడుకొని ఒక విజయాన్ని అందుకున్నాడు వరుణ్ తేజ్. అప్పుడు టైటిల్‌తోనే సరిపెట్టుకున్న వరుణ్.. ఇప్పుడు ఏకంగా బాబాయ్ సినిమాను రీమేక్ చేయాలని చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈయన అల్లు అరవింద్ నిర్మాణంలో కిరణ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

Varun Tej to act in Pawan Kalyan disaster movie remake which will be his next movie under Kiran direction pk అవునా.. ఇదెప్పుడు జరగబోతుంది.. రీమేక్ చేస్తే హిట్ సినిమాను తీసుకుంటారు కదా.. ఫ్లాప్ సినిమా తీసుకోవడం ఏంటి అనుకుంటున్నారా..? ప్రస్తుతం ఇండస్ట్రీలో అయితే ఇలాంటి వార్తలే వినిపిస్తున్నాయి.. వరుణ్ తేజ్.. pawan kalyan,varun tej,varun tej twitter,varun tej jhonny movie remake,varun tej boxing,varun tej boxer,varun tej pawan kalyan jhonny movie remake,varun tej about pawan kalyan,varun tej speech,pawan kalyan craze,varun tej movies,pawan kalyan fans,varun tej valmiki,varun tej new movie,varun tej on pawan kalyan,varun tej and pawan kalyan,hero varun tej pawan kalyan,varun tej supports pawan kalyan,varun tej campaign with pawan kalyan,varun tej about janasena pawan kalyan,pawan kalyan speech,telugu cinema,వరుణ్ తేజ్,పవన్ కల్యాణ్,పవన్ కల్యాణ్ వరుణ్ తేజ్,జానీ రీమేక్‌లో వరుణ్ తేజ్,తెలుగు సినిమా
వరుణ్ తేజ్ పవన్ కల్యాణ్

దీనికి అల్లు బాబి నిర్మాత. ఇదిలా ఉంటే ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. తెలుగులో బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందులో జానీ సినిమా కూడా ఒకటి. అప్పట్లో పవన్ కళ్యాణ్ వరుస విజయాలతో ఉన్నప్పుడు స్వయంగా దర్శకత్వం వహించి నటించిన సినిమా ఇది. పవన్ వరస విజయాలకు బ్రేక్ వేయడమే కాకుండా ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిపోయింది జానీ. కథ ఎమోషనల్‌గా ఉన్నా కూడా ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోవడంతో ప్లాప్ అయింది. అయితే ఈ సినిమాను కాస్త మార్చి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి స్క్రీన్ ప్లేలో కొన్ని మార్పులు చేసుకుంటే ఖచ్చితంగా సినిమా సంచలన విజయం సాధించి ఉండేదని అప్పట్లో విశ్లేషకులు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నారు.

Varun Tej to act in Pawan Kalyan disaster movie remake which will be his next movie under Kiran direction pk అవునా.. ఇదెప్పుడు జరగబోతుంది.. రీమేక్ చేస్తే హిట్ సినిమాను తీసుకుంటారు కదా.. ఫ్లాప్ సినిమా తీసుకోవడం ఏంటి అనుకుంటున్నారా..? ప్రస్తుతం ఇండస్ట్రీలో అయితే ఇలాంటి వార్తలే వినిపిస్తున్నాయి.. వరుణ్ తేజ్.. pawan kalyan,varun tej,varun tej twitter,varun tej jhonny movie remake,varun tej boxing,varun tej boxer,varun tej pawan kalyan jhonny movie remake,varun tej about pawan kalyan,varun tej speech,pawan kalyan craze,varun tej movies,pawan kalyan fans,varun tej valmiki,varun tej new movie,varun tej on pawan kalyan,varun tej and pawan kalyan,hero varun tej pawan kalyan,varun tej supports pawan kalyan,varun tej campaign with pawan kalyan,varun tej about janasena pawan kalyan,pawan kalyan speech,telugu cinema,వరుణ్ తేజ్,పవన్ కల్యాణ్,పవన్ కల్యాణ్ వరుణ్ తేజ్,జానీ రీమేక్‌లో వరుణ్ తేజ్,తెలుగు సినిమా
వరుణ్ తేజ్ పవన్ కల్యాణ్

ఇప్పుడు వరుణ్ తేజ్ ఇదే చేయబోతున్నాడని తెలుస్తోంది. జానీ సినిమా కథను తీసుకొని దాన్ని తన ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్చి మరింత ఎమోషనల్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఆయన కూడా బాక్సర్‌గా నటించబోతున్నాడు. దీని కోసం అమెరికా వెళ్లి ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు వరుణ్ తేజ్. ఇందులో వరుణ్ తేజ్ తండ్రిగా హీరో మాధవన్ నటించబోతున్నాడు. తల్లిగా రమ్యకృష్ణ కనిపించబోతుంది. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత జానీ గుర్తుకు వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అప్పట్లో బాబాయ్ మిస్సయిన టార్గెట్ ఇప్పుడు అబ్బాయి అందుకోవాలని చూస్తున్నాడు. మరి ఈ విషయంలో వరుణ్ తేజ్ ఎంత వరకు సక్సెస్ అవుతాడో చూడాలి. ఈ మధ్యే గద్దలకొండ గణేష్ సినిమాతో మంచి విజయం అందుకొన్నాడు ఈ హీరో.
Published by: Praveen Kumar Vadla
First published: December 6, 2019, 8:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading