వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా గని. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమాను డైరెక్టర్ కిరణ్ తీస్తున్నారు. ఏప్రిల్ 8న ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా గని సినిమాకు సంబంధించిన అనేక విషయాల్ని హీరో వరుణ్ తేజ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో అభిమానులతో పంచుకున్నాడు. గని సినిమా తీయడానికి కళ్యాణ్ బాబయ్ తన ఇనిస్పిరేషన్ అన్నాడు. పవన్ కళ్యాణ్ తీసిన తమ్ముడు సినిమాను చిన్నప్పుడు చూశామన్నాడు వరుణ్. తమ్ముడు సినిమా తనకెంతగానో నచ్చిందన్నాడు. అలాంటి స్పోర్ట్స్ బ్యాంక్ గ్రౌండ్ ఉన్న సినిమాలు చేయాలనుకున్నానని తెలిపాడు. గని సినిమా చేయడానికి కళ్యాణ్ బాబయ్ కారణమన్నాడు. థాంక్యూ కళ్యాణ్ బాబయ్ అంటూ వరుణ్ తేజ్ స్టేజ్‌పై పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పాడు.
వైజాగ్ ప్రజల అభిమానానికి కృతజ్ఞతలు తెలిపాడు. తమ్ముడు అంత హిట్ కాకపోయిన.. గని సినిమా బాగుండాలని ఆశిస్తున్నానన్నాడు. ఈ సినిమా కోసం పనిచేస్తున్న ప్రతీ ఒకరికి పేరు పేరున ధన్యావాదాలు తెలిపాడు వరుణ్. బన్నీ వస్తున్నాడు.. ఫంక్షన్ బాగా జరుగుతుందని చిరంజీవి ఫోన్ చేసి చెప్పారన్నారు. ఈవెంట్‌కు వచ్చిన బన్నీకి కూడా కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సినిమా విషయంలో చరణ్ కూడా తనకు హెల్ప్ చేశాడన్నాడు. ఇక సినిమా తీసిన ప్రొడ్యూసర్లకు ధైర్యం చెబుతూ.. డబ్బులు వెనక్కి వచ్చేస్తాయని హామీ ఇచ్చాడు వరుణ్. కోవిడ్ కారణంగా ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిందన్నాడు. ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలన్న లక్ష్యంతోనే కష్టపడుతూ.. ఇంత వరకు తీసుకొచ్చామన్నారు.
ఇక అల్లు అరవింద్ మాట్లాడుతూ.. గని సినిమా చూశా. చాలా ఎమోషనల్‌గా ఉంది. కిరణ్ అద్భుతంగా తీశాడన్నారు. వరుణ్ తేజ్ కథానాయకుడిగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన చిత్రం ‘గని’. అల్లు బాబీ, సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.సయీ మంజ్రేకర్ కథానాయిక. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ghani Movie, Pawan kalyan, Varun Tej