Home /News /movies /

VARUN TEJ SHARED RAM CHARAN ALLU ARJUN THROW BACK PIC IN INSTAGRAM TA

చరణ్, బన్నిలతో కలిసి ఉన్న పాత ఫోటోను షేర్ చేసిన వరుణ్ తేజ్..

మెగా ఫ్యామిలీ హీరోల త్రోబ్యాక్ పిక్ (Instagram/Photo)

మెగా ఫ్యామిలీ హీరోల త్రోబ్యాక్ పిక్ (Instagram/Photo)

ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రోబ్యాక్ పిక్ ట్రెండ్ నడుస్తోంది. ఎవరైన తమకు సంబంధించిన స్పెషల్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి.తాజాగా వరుణ్ తేజ్.. తన తోటి మెగా హీరోలతో కలిసి ఉన్న ఫోటోను సోసల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

    ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రోబ్యాక్ పిక్ ట్రెండ్ నడుస్తోంది. ఎవరైన తమకు సంబంధించిన స్పెషల్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. దానికి త్రోబ్యాక్ పిక్ అనే క్యాప్షన్ ఇవ్వాలి. అంతేకాదు పోస్ట్ చేసే ఫోటోలో ఏదైనా స్పెషాలిటీ ఉండాలి. రీసెంట్‌గా అల్లు రామలింగయ్య పద్మశ్రీ అవార్డు తీసుకొని హైదరాబాద్ వచ్చినపుడు విమానాశ్రయంలో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఆ ఫోటోలో అల్లు అర్జున్, రామ్ చరణ్, శిరీష్  ఉన్నారు. తాజాగా వరుణ్ తేజ్.. రామ్ చరణ్, అల్లు అర్జున్‌లతో ఉన్న పాత ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఈ ఫోటోలో వరుణ్ తేజ్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌లతో పాటు  రామ్ చరణ్ అక్క సుస్మిత, సాయి ధరమ్ తేజ్ ఈ ఫోటోలో ఉన్నారు.


    ఈ ఫోటోలో తమ హీరోలను చూసుకొని అభిమానులు ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు. ఈ పోస్ట్‌కు వరుణ్ తేజ్.. ‘మేజర్ త్రోబ్యాక్’ అని వరుణ్ తేజ్ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం రామ్  చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతికి రిలీజ్ కానుంది. సాయి ధరమ్ తేజ్.. హీరోగా నటించిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమా డిసెంబర్‌లో విడుదల కానుంది. ఇంకోవైపు వరుణ్ తేజ్.. రెండు మూడు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Ala Vaikunthapurramloo, Allu Arjun, Ram Charan, RRR, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood, Varun Tej

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు