Chiranjeevi- Varun Tej: మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ మూవీ నుంచి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తోన్న అప్డేట్ తాజాగా వచ్చింది. ఆచార్య టీజర్‌ని ఈ నెల 29న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసిన దర్శకుడు కొరటాల శివ.. తమ ధర్మ స్థలి తలుపులు వచ్చే జనవరి 29న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు తెరుచుకుంటాయని తెలిపారు. కాగా కొరటాల ఈ అప్డేట్ ఇచ్చిన కాసేపటికే.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆచార్యకు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
చరణ్ అన్న వాయిస్ అంట కదా టీజర్‌కి.. అని బయట టాక్ అని ఓ మీమ్‌ని వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ విషయం తెలిసిన మెగాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ మూవీలో చెర్రీ కీలక పాత్రలో నటిస్తుండగా.. ఇప్పుడు టీజర్‌కి వాయిస్ కూడా ఇవ్వనున్నాడని తెలిసి ఫ్యాన్స్ సంతోషం రెట్టింపు అయ్యింది.
కాగా సామాజిక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. సోనూసూద్, అజయ్, హిమజ కీలక పాత్రల్లో నటించనున్నారు. రెజీనా ప్రత్యేక గీతంలో మెరియనుంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.