గద్దలకొండ గణేష్‌తో తనలోని కొత్త యాంగిల్‌ను పరిచయం చేశాడు మెగా ప్రిన్స్. కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌గా తెరపై కనిపించి మెగా అభిమానులకు కనవిందు చేశాడు. ఇన్నాళ్లు లవర్ బాయ్‌గా కనిపించిన వరుణ్.. ఈ సినిమాలో విలన్‌గా మెప్పించి అసలైన హీరో అనిపించుకున్నాడు. ప్రస్తుతం గద్దలకొండ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న వరుణ్.. తన తొలి ముద్దు గురించి ఆసక్తికర విషయాన్ని బయబపెట్టాడు. లక్ష్మి మంచు వ్యాఖ్యాతగా 'వూట్' ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రసారమైన 'ఫీటప్ విత్ స్టార్స్' కార్యక్రమంలో పాల్గొన్నారు వరుణ్ తేజ్. ఇందులో లక్ష్మి మంచుతో తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించి పలు విషయాలను పంచుకున్నాడు..
14 వయసులోనే తొలి ముద్దు రుచి చూశానని చెప్పాడు వరుణ తేజ్. టెన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఓ అమ్మాయిని ముద్దు పెట్టుకున్నట్లు లక్ష్మి మంచు షోలో వెల్లడించాడు. అది ఎలా జరిగిందో కాస్త వివరంగా చెప్పవా అని లక్ష్మి అడగడంతో.. అదొక బ్యాడ్ మెమరీ అని చెప్పాడు వరుణ్. ఏదో అలా జరిగిపోయిందని.. అంతకు మించి వివరంగా చెప్పలేనని తెలిపాడు మెగా ప్రిన్స్.
అమ్మాయిల నుంచి తనకు ఎన్నోసార్లు ప్రపోజల్స్ వచ్చాయని వరుణ్ చెప్పాడు. హైదరాబాద్‌లో ఓ క్లబ్ ఈవెంట్‌లో ఉండగా ఊహించని పరిణామాన్ని ఎదుర్కొన్నానని గుర్తచేసుకున్నాడు. తన ఫ్రెండ్స్‌తో కలిసి డాన్స్ చేస్తుండగా.. వెనకాల నుంచి ఓ అమ్మాయి గట్టిగా పట్టుకుందని చెప్పాడు. నా స్నేహితులని మొదట అనుకున్నానని.. కానీ వారంతా తన ముందే ఉన్నారని వివరించాడు. వెనక్కి తిరిగి చూస్తే ఓ అమ్మాయి కనిపించందని తెలిపాడు వరుణ్. తేరుకునే లోపే ఆ అమ్మాయి తన బుగ్గుపై ముద్దుపెట్టి పారిపోయిందని.. ఆ సమయంలో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చాడు.
తన లైఫ్‌లో మోస్త్ కలర్‌ఫుల్ పర్సన్.. తన చెల్లి నిహారికేనని చెప్పాడు వరుణ్ తేజ్. నిహారికతో ఉన్న అనుంబంధాన్ని లక్ష్మి మంచుతో పంచుకున్నాడు. తాను సైలెంట్..కానీ తన చెల్లి మాత్రం వైలైంట్ అని పొగడ్తల్లో ముంచెత్తాడు గద్దలకొండ గణేష్. నా కంటే ఎనర్జిటిక్‌గా, యాక్టివ్‌గా ఉంటుందన్న వరుణ్.. ఏదైనా బాధ కలిగితే నిహారికతోనే పంచుకుంటానని చెప్పాడు. తన చెల్లి ఎప్పుడూ తనకు షోల్డర్‌లా ఉంటుందని మెచ్చుకున్నాడు వరుణ్ తేజ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gaddalakonda Ganesh Movie, Lakshmi manchu, Niharika konidela, Telugu Cinema, Tollywood, Varun Tej