హోమ్ /వార్తలు /సినిమా /

Elluvochi Godaramma Full Video Song: 100 మిలియన్ క్లబ్‌లో వరుణ్ తేజ్, పూజా హెగ్డే ‘ఎల్లవొచ్చి గోదారమ్మ’..

Elluvochi Godaramma Full Video Song: 100 మిలియన్ క్లబ్‌లో వరుణ్ తేజ్, పూజా హెగ్డే ‘ఎల్లవొచ్చి గోదారమ్మ’..

ఎల్లవొచ్చి గోదారమ్మ సాంగ్ (Elluvochi Godaramma song)

ఎల్లవొచ్చి గోదారమ్మ సాంగ్ (Elluvochi Godaramma song)

Elluvochi Godaramma Full Video Song: వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా హరీష్‌ శంకర్‌ తెరకెక్కించిన చిత్రం గద్దలకొండ గణేష్. ఇందులో శోభన్ బాబు ఎవర్‌గ్రీన్‌ సాంగ్ ఎల్లువొచ్చి గోదారమ్మ(Elluvochi Godaramma Full Video Song) పాటను రీమిక్స్‌ చేశారు. విడుదలైనపుడు ఈ పాట మంచి రెస్పాన్స్ అందుకుంది.

ఇంకా చదవండి ...

వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా హరీష్‌ శంకర్‌ తెరకెక్కించిన చిత్రం గద్దలకొండ గణేష్. వాల్మీకిగా వచ్చి.. ఆ తర్వాత వివాదాల్లో ఇరుక్కుని చివరికి గద్దలకొండ గణేష్‌గా వచ్చింది ఈ చిత్రం. ఇందులో తమిళ హీరో అథర్వా మురళి కూడా నటించాడు. 2019 సెప్టెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం దాదాపు 25 కోట్లకు పైగా వసూలు చేసి మంచి విజయమే అందుకుంది. ఇందులో శోభన్ బాబు ఎవర్‌గ్రీన్‌ సాంగ్ ఎల్లువొచ్చి గోదారమ్మ పాటను రీమిక్స్‌ చేశారు. విడుదలైనపుడు ఈ పాట మంచి రెస్పాన్స్ అందుకుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగానే ఈ పాటను విడుదల చేసారు అప్పట్లో. బిందెల మధ్యలో ఈ పాటను రిలీజ్ చేసారు. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రెండేళ్ల కింద విడుదలైన ఫుల్ వీడియో సాంగ్‌కు అద్భుతమైన స్పందన వస్తుంది. రిస్క్ తీసుకోకుండా ఉన్నదున్నట్లు తీసాడు దర్శకుడు.

ఈ పాటకు యూ ట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. శేఖర్ మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ చేసాడు. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన దేవత సినిమాలోని పాట ఇది. ఇప్పటికీ ఎల్లువొచ్చి గోదారమ్మ పాట అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటుంది.

శోభన్ బాబు, శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన ఈ పాట ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. కచ్చితంగా ఈ పాట యూ ట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తుందని బలంగా నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. అనుకున్నట్లుగానే 100 మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంది ఈ పాట. పైగా ఈ పాటలో పూజా హెగ్డే అందాలు కూడా అదిరిపోయాయి. అదే ప్రధానాకర్షణ కూడా. తమిళ బ్లాక్ బస్టర్ జిగర్తాండకి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించాడు హరీష్ శంకర్.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Gaddalakonda Ganesh Movie, Pooja Hegde, Telugu Cinema, Varun Tej

ఉత్తమ కథలు