Home /News /movies /

Varun Tej 10 : వైజాగ్‌ నగరంలో వరుణ్ పోరాటాలు..

Varun Tej 10 : వైజాగ్‌ నగరంలో వరుణ్ పోరాటాలు..

వరుణ్ తేజ్: మరో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఫిదా, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్ లాంటి సినిమాలతో 30 కోట్ల మార్కెట్ తెచ్చుకున్నాడు.

వరుణ్ తేజ్: మరో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఫిదా, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్ లాంటి సినిమాలతో 30 కోట్ల మార్కెట్ తెచ్చుకున్నాడు.

Varun Tej : వరుణ్ తేజ్ తాజా సినిమా షూటింగ్ వైజాగ్ నగరంలో జరుగుతోంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.

    మెగా హీరో వరుణ్‌ తేజ్‌ మొదట్లో తడబడ్డ.. ఆ తర్వాత మూస కథలతో వచ్చే సినిమాలను పక్కన పెట్టి.. కొత్తరకం కథలను ఎంచుకోవడం చేయడం మొదలు పెట్టాడు.. దీంతో వరుస విజయాలు వరుణ్ సొంతం అయ్యాయి. వరుణ్ తేజ్ కెరీర్ విషయానికి వస్తే.. 2000లో ‘హ్యాండ్స్ అప్’ అనే సినిమాలో వరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించినా.. ఆయన అసలు కెరీర్ 2014లో వచ్చిన ‘ముకుంద’ సినిమాతో మొదలైంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఆ సినిమా ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేదు. కానీ ఆ సినిమాలో వరుణ్ తన నటనతో అదరగొట్టాడు. ఆ తర్వాత మరో ప్రయోగం కంచె. ఈ సినిమాను క్రిష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో విజయం సాధించింది. అంతేకాదు సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిలింగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇక్కడి నుంచి వరుణ్ ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటూ వస్తున్నాడు. అయితే ఆ మధ్య పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ వంటి రఫ్ పాత్ర చేసి మరో కోణం చూపించాడు. ఇక ‘ఫిదా’, ‘తొలిప్రేమ’, ‘అంతరిక్షం’ 'f2' సినిమాలు వరుణ్ కెరీర్‌కు మంచి మైలేజ్ ఇచ్చాయి. ఇటీవల ‘గద్దలకొండ గణేష్’ అంటూ ఊరమాస్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదరగొట్టాడు. ఈ సినిమా వరుణ్ కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచిపోయింది.


    వరుణ్ కొత్త చిత్రాన్ని కొంత సమయం తీసుకుని మొదలు పెట్టాడు. ఈ సినిమాతో బాక్సర్ పాత్రలో నటించనున్నాడు వరుణ్. కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వైజాగ్‌ నగరంలో జరుగుతుంది. అక్కడ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్‌ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం కోసం వరుణ్ ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమా దాదాపు రూ.35 కోట్లతో భారీగా తెరకెక్కుతోంది. వరుణ్‌కు జోడిగా ప్రముఖ హిందీ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించనుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిచనున్నాడు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Varun Tej

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు