హోమ్ /వార్తలు /సినిమా /

HBD Varun Tej: వరుణ్ తేజ్ కొత్త సినిమా టైటిల్ రివీల్.. ప్లాన్ గట్టిగానే చేసినట్టున్నారుగా!

HBD Varun Tej: వరుణ్ తేజ్ కొత్త సినిమా టైటిల్ రివీల్.. ప్లాన్ గట్టిగానే చేసినట్టున్నారుగా!

Varun Tej Praveen Sattaru movie

Varun Tej Praveen Sattaru movie

Gandeevadhari Arjuna: టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ చేస్తున్న కొత్త సినిమా టైటిల్ 'గాండీవధారి అర్జున' అని తెలుపుతూ అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మెగా హీరో వరుణ్ తేజ్ (Varun tej) కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేడు (జనవరి 19) వరుణ్ తేజ్ పుట్టిన రోజు (Varun Tej Birth Day) కానుకగా ఆయన లేటెస్ట్ మూవీ టైటిల్ రివీల్ చేస్తూ కొత్త పోస్టర్ వదిలారు మేకర్స్. ఈ మేరకు మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచారు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో వరుణ్ చేస్తున్న సినిమా టైటిల్ 'గాండీవధారి అర్జున' (Gandeevadhari Arjuna) అని తెలుపుతూ అధికారిక ప్రకటన ఇచ్చారు.

ఈ 'గాండీవధారి అర్జున' మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడంతో ఈ సినిమాపై జనాల్లో ఉన్న ఆసక్తి రెట్టింపయింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్.. జేమ్స్ బాండ్ తరహా పాత్ర పోషించబోతున్నట్లు ఈ వీడియో స్పష్టం చేస్తోంది. ఈ వీడియోలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. చేతిలో గన్ పట్టుకొని అగ్రెసివ్ ఇంటెన్సిటీతో కనిపించారు వరుణ్ తేజ్. ఈ లుక్ చూస్తుంటే గతంలో ఎన్నడూచూడని విధంగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

వరుణ్ తేజ్ 12వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ 'గాండీవధారి అర్జున' సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా వదిలిన మోషన్ పోస్టర్ లో మిక్కీ జే కంపోజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయింది.

అన్ని కమర్షియల్ హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్ గానే ఉంచారు మేకర్స్. త్వరలోనే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను ప్రకటించనున్నారని సమాచారం. ఈ సినిమా పూర్తి కాగానే కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హుడా డైరెక్షన్ లో మరో సినిమా చేయనున్నారు వరుణ్ తేజ్. ఆయన కెరీర్ లో 13వ సినిమాగా రానున్న ఈ చిత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా వరుణ్ కనిపించనున్నారట. సో.. చూస్తుంటే వరుసపెట్టి రెండు యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలతో వరుణ్ తేజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు స్పష్టమవుతోంది.

First published:

Tags: Praveen Sattaru, Tollywood, Varun Tej

ఉత్తమ కథలు