సంక్రాంతి బరిలో వరుణ్ తేజ్.. మెగా ఫ్యాన్స్‌కు పండగే..

షాకింగ్.. ఇప్పటికే సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు బరిలో దిగుతున్నాయి. వీటికి పోటీగా వరుణ్ తేజ్ పొంగల్ పోటీలో నేనున్నాను అంటూ రంగంలోకి దిగబోతున్నాడు. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: January 1, 2020, 3:32 PM IST
సంక్రాంతి బరిలో వరుణ్ తేజ్.. మెగా ఫ్యాన్స్‌కు పండగే..
Instagram/varunkonidela7
  • Share this:
షాకింగ్.. ఇప్పటికే సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు బరిలో దిగుతున్నాయి. వీటికి పోటీగా వరుణ్ తేజ్ పొంగల్ పోటీలో నేనున్నాను అంటూ రంగంలోకి దిగబోతున్నాడు. వివరాల్లోకి వెళితే.. జనవరి 9న రజినీకాంత్ ‘దర్బార్’ మూవీతో ప్రారంభమయ్యే పొంగల్ పోటీ.. ఆ తర్వాత మహేష్ బాబు.. ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపుమరములో’ చివరగా కళ్యాణ్ రామ్.. ‘ఎంత మంచివాడవురా’ సినిమాతో సంక్రాంతి పోటీ ముగుస్తుంది. ఐతే.. ఈ సినిమాకు పోటీగా వరుణ్ తేజ్ తన కొత్త సినిమాతో రాబోతున్నాడు. కానీ మెగా ప్రిన్స్ ఈ హీరోలకు పోటీ ఇచ్చేది బిగ్ స్క్రీన్ పై కాదు.. స్మాల్ స్క్రీన్ పై. గతేడాది వరుణ్ తేజ్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రాన్ని జనవరి 12న ఆదివారం స్టార్ మా లో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా వాళ్లు టెలికాస్ట్ చేసారు. ఇప్పటికే స్టార్ మా ప్రీమియం ఉన్నవాళ్లు ఈ సినిమాను చూసే ఉండరు. చూడని వాళ్లు జనవరి 12న ఈ సినిమాను స్టార్ మాలో ఎంచక్కా చూడొచ్చు.
View this post on Instagram

Ee Sankranthiki mi intlo pandaga cheyaniki #GaddalaKondaGanesh vastundu..Ready ga undundi #GaddalaKondaGaneshOnStarMaa


A post shared by STAR MAA (@starmaa) on
Published by: Kiran Kumar Thanjavur
First published: January 1, 2020, 3:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading