మెగా హీరో వ‌రుణ్ తేజ్‌కు యాక్సిడెంట్.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం..

హీరో వ‌రుణ్ తేజ్‌కు యాక్సిడెంట్ అయింది. వాల్మీకి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మెగా హీరోకు అనుకోకుండా ప్ర‌మాదం జ‌రిగింది. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కార్ ప్ర‌మాదానికి గురైంది. వ‌న‌ప‌ర్తి జిల్లాలో ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 12, 2019, 8:41 PM IST
మెగా హీరో వ‌రుణ్ తేజ్‌కు యాక్సిడెంట్.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం..
వరుణ్ తేజ్ ఫైల్ ఫోటో
Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 12, 2019, 8:41 PM IST
హీరో వ‌రుణ్ తేజ్‌కు యాక్సిడెంట్ అయింది. వాల్మీకి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మెగా హీరోకు అనుకోకుండా ప్ర‌మాదం జ‌రిగింది. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కార్ ప్ర‌మాదానికి గురైంది. వ‌న‌ప‌ర్తి జిల్లా కొత్తకోట మండలం రాయని పేట స్టేజీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే దీనికి కారణం అని కొత్తకోట సిఐ తెలిపారు. ముందున్న మరో రెండు కార్లను బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు పోలీసులు. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో వరుణ్ తేజ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఈ యాక్సిడెంట్‌లో ఇద్దరు మాత్రం గాయపడ్డారు. కర్నూలులో వాల్మీకి షూటింగ్ జరుగుతుంది.



అక్కడికే తన కార్లో బయల్దేరాడు వరుణ్ తేజ్. వ‌రుణ్ తేజ్‌కు యాక్సిడెంట్ కావ‌డంతో అభిమానులు కంగారు ప‌డుతున్నారు. అయితే ఈ ప్ర‌మాదంలో మెగా హీరో చిన్న‌పాటి గాయాల‌తోనే బ‌య‌ట‌ప‌డ్డారు. కార్ ధ్వంసమైనా కూడా హీరోకు ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌క్క‌పోవ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు కుటుంబ స‌భ్యులు, అభిమానులు. అనుకోకుండా జ‌రిగిన ఈ ప్ర‌మాదంతో ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది మెగా కుటుంబం. ఈ మ‌ధ్యే ఎఫ్2 సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న వ‌రుణ్ తేజ్.. ఇప్పుడు వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.

First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...