హోమ్ /వార్తలు /సినిమా /

Varun Tej: వరుణ్ తేజ్ పెళ్లి.. నాకెలాంటి అభ్యంతరం లేదు.. వధువుపై క్లారిటీ ఇచ్చేసిన నాగబాబు సతీమణి

Varun Tej: వరుణ్ తేజ్ పెళ్లి.. నాకెలాంటి అభ్యంతరం లేదు.. వధువుపై క్లారిటీ ఇచ్చేసిన నాగబాబు సతీమణి

వరుణ్ తేజ్ పెళ్లిపై క్లారిటీ

వరుణ్ తేజ్ పెళ్లిపై క్లారిటీ

వరుణ్ తేజ్ పెళ్లిపై రకరకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిహారికతో పాటు.. ఆమె తల్లి పద్మజ కూడా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో వరుణ్ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లిపై సోదరి నిహారిక, తల్లి పద్మజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు సతీమణి... వరుణ్ పెళ్లిపై స్పందించారు. నాగబాబు ఇంట్లో నాగబాబుతో పాటు.. కూతురు నిహారిక, కొడుకు వరుణ్ తేజ్ కూడా నటులేనని.. త్వరలో కాబోయే కోడలు కూడా నటియేనని తెలుస్తుందని.. యాంకర్ అన్న వ్యాఖ్యలకు నాగబాబు సతీమణి పద్మజ స్పందించారు. తనకు కోడలిగా ఎవరు వచ్చిన ఎలాంటి అభ్యంతరం లేదన్నారు పద్మజ. తాను కూడా వరుణ్ కోసం బయట సంబంధాలు చూస్తున్నానన్నారు. ఒకవేళ హీరోయిన్ తనకు కోడలిగా వచ్చిన అభ్యంతరం లేదన్నారు. పిల్లలు హ్యాపీగా ఉంటే చాలు కదా అంటూ వరుణ్ తల్లి సమాధానం ఇచ్చారు. ఆ విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

పద్మజ మాట్లాడుతుండగా పక్కనే ఉన్న నిహారిక స్పందిస్తూ.. నాకే అలాంటి ఛాన్స్ లేకుండా పోయిందన్నారు. దీనికి యాంకర్ మీ ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదా అంటూ ప్రశ్నించారు. దానికి నిహారిక స్పందిస్తూ.. అలాంటిదేమి లేదన్నారు. తన తల్లిదండ్రలు అలా ఎప్పుడూ ప్రవర్తించలేదన్నారు. తనకే ఎవరూ దొరకలేదన్నారు. ఇక నిహారిక చైతన్యల వివాహం జరిగిన విషయం తెలిసిందే. చైతన్యతో తన పెళ్లి పెద్దలు కుదర్చినదేనని చెప్పుకొచ్చారు నిహారిక. స్కూల్‌లో వరుణ్ చైతన్య క్లాస్ మేట్స్ అన్నారు. ఒక ఏడాది పాటు కలిసి ఒకే స్కూల్‌లో చదువుకున్నారని నిహారిక తెలిపారు.

వరుణ్ తేజ్ విషయానికి వస్తే.. వరుణ్ .. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాటి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఈ మధ్య వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన పుట్టినరోజు సందర్భంగా వరుణ్ తేజ్ ఆమెను కలవడానికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ పుకార్లకు సమాధానం ఇచ్చింది లావణ్య.

ఇక వీరిద్దరూ కలిసి మిస్టర్ ,అంతరిక్షం సినిమాలో కలిసి నటించారు. అప్పట్లో వెండితెరపై వీరి కెమిస్ట్రీ చూసి వీరు నిజజీవితంలో కూడా ప్రేమలో ఉన్నారని పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇదే సమయంలో వరుణ్ తేజ సోదరి నిహారిక పెళ్లి కి కూడా లావణ్య రావడంతో ఆ వార్తలు మరింత అందుకున్నాయి. ఇప్పుడు వరుణ్ తేజ్ తల్లి, నిహారిక చేసిన వ్యాఖ్యలతో వరుణ్ పెళ్లిచేసుకోబోయేది ఎవరు ? అన్న టాపిక్ ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.

First published:

Tags: Mega Family, Naga Babu Konidela, Niharika konidela, Varun Tej

ఉత్తమ కథలు