Varun Tej Ghani: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన టాలీవుడ్‌లో అడుగుపెట్టిన వరుణ్ తేజ్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లోనే వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ టాలీవుడ్‌లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. మొదట్లో కథల విషయంలో తడబడ్డ.. ఆ తర్వాత మూస కథలతో వచ్చే సినిమాలను పక్కన పెట్టిన వరుణ్ కొత్తరకం కథలను ఎంచుకోవడం చేయడం మొదలు పెట్టాడు. దీంతో వరుస విజయాలను వరుణ్ సొంతం చేసుకుంటున్నాడు. 2019లో ‘గద్దలకొండ గణేష్’ తర్వాత కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ‘గని’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఆ పోస్టర్‌లో వరుణ్ బాక్సింగ్ చేస్తూ ఎనర్జిటిక్ లుక్‌లో కేకపెట్టిస్తున్నాడు. ఈ సినిమాతో బాక్సర్ పాత్రలో నటించనున్నాడు వరుణ్. గని సినిమాను కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం వరుణ్ ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకున్నారు.
ఈ సినిమా దాదాపు రూ.35 కోట్లతో భారీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాను జూలై 30న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మొత్తంగా మెగా హీరోలందరు ఒక్కొక్కరుగా తమ సినిమాల విడుదల తేదిలను ఖరారు చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు.
Entering the ring this July!?#GhaniOnJuly30th@nimmaupendra @SunielVShetty @saieemmanjrekar @IamJagguBhai @dir_kiran @RenaissanceMovi pic.twitter.com/0vlkmRh2uH
— Varun Tej Konidela ? (@IAmVarunTej) January 28, 2021
‘గని’ సినిమాలో వరుణ్ తేజ్‌కు జోడిగా ప్రముఖ హిందీ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వరుస చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. వరుణ్ తేజ్‘గని’ సినిమాతో పాటు ఎఫ్ 2 మూవీకి సీక్వెల్‌గా ఎఫ్ 3 మూవీ చేస్తోంది. ఈ సినిమాలో మరోసారి వెంకటేష్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో మరో హీరోగా సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.