VARUN TEJ GHANI TRAILER TALK THE EMOTIONAL GAME MOVIE TA
Varun Tej - Ghani Trailer Talk : వరుణ్ తేజ్ ‘గని’ ట్రైలర్ టాక్.. పవర్ పంచ్ అదిరిందిగా..
వరుణ్ తేజ్ ‘గని’ ట్రైలర్ విడుదల (Twitter/Photo)
Varun Tej - Ghani Trailer Talk :మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ (Varun Tej) ప్రస్తుతం గని అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
Varun Tej - Ghani Trailer Talk :మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ (Varun Tej) ప్రస్తుతం గని అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమా దాదాపు రూ.35 కోట్లతో భారీగా తెరకెక్కింది. ఇక ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాను షెడ్యూల్ ప్రకారం గతేడాది జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని ప్రకటించింది చిత్రబృందం. ఆ తర్వాత ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రటించారు. ఆ తర్వాత ‘అన్నాత్తే’ (పెద్దన్న) పోటీలో ఉండటంతో ఈ సినిమాను డిసెంబర్ 3కు రీ షెడ్యూల్ చేసారు. కానీ డిసెంబర్ 2న బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ మూవీ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
అల్లు అరవింద్.. తన తనయుడు అల్లు బాబీ నిర్మాతగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 24కు మరోసారి పోస్ట్ చేసారు. ఆ తర్వాత ‘గని’ సినిమాను ఫిబ్రవరి 25న లేదా మార్చ్ 4న థియేటర్స్ లో రిలీజ్ చేయన్నట్టుగా అధికారికంగా ప్రకటించింది టీమ్. చివరగా ఏప్రిల్ 8న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసారు.
బాక్సింగ్ చాంపియన్ కావాలనుకునే ’గని’ నుంచి నువ్వు జీవితంలో బాక్సింగ్ ఆడనని అమ్మకు మాటిస్తాడు. మరి అమ్మ మాటను జవదాటి ఎలా బాక్సింగ్‌లో గని నేషనల్ ఛాంపియర్ అయ్యాడనేదే ‘గని’ మూవీ స్టోరీలా కనిపిస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘తమ్ముడు’ సినిమా స్టోరీనే కాస్తా అటు ఇటు మార్చి తెరకెక్కించారు. ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలు బాలీవుడ్లో చాలానే తెరకెక్కాయి. మధ్యలో హీరోయిన్‌తో లవ్ ట్రాక్ వంటివి ఉన్నాయి. మొత్తంగా ఈ సినిమా కోసం వరుణ్ తేజ్.. సిక్స్ ప్యాక్ బాడీ కోసం బాగానే చెమటోడ్చాడు. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు నటించారు.
‘గని’ ట్రైలర్ విడుదల
’గని’ మూవీకి సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సినిమా టోటల్ రన్ టైమ్ 2 గంటల 31 నిమిషాల 17 సెకన్లు ఉంది. ‘గని’ సినిమాను కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో వరుణ్ ఫిజిక్ అదిరిందని అంటున్నారు నెటిజన్స్. గని సినిమాను అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మించారు.
ఇక ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎఫ్ 3లో కూడా నటిస్తున్నారు. ఎఫ్ 3లో వరుణ్‌కు జంటగా మెహ్రీన్ నటిస్తుండగా.. మరో జంటగా వెంకటేష్ తమన్నాలు నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్ మరింత కామెడీ ఉంటుందని.. పొట్టలు చెక్కలయ్యేలా అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేసారట. భార్యలు మితిమీరిన ఖర్చులతో చేసిన అప్పులు తట్టుకోలేక.. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి ఓ హోటల్ పెడతారు. అక్కడ్నుంచి వాళ్లకు ఎదురయ్యే సమస్యలు.. పడే పాట్లేఅనేది ఈ సినిమా కథ అంటున్నారు. ఈ సినిమాను మే 27న ఎన్టీఆర్ జయంతి రోజున విడుదల చేస్తున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.