హోమ్ /వార్తలు /సినిమా /

Varun Tej : చివరి షెడ్యూల్‌‌‌లో వరుణ్ తేజ్ గని.. క్లైమాక్స్ షూటింగ్‌లో చిత్రబృందం..

Varun Tej : చివరి షెడ్యూల్‌‌‌లో వరుణ్ తేజ్ గని.. క్లైమాక్స్ షూటింగ్‌లో చిత్రబృందం..

బాలు సినిమాలో పవన్ కళ్యాణ్ రెండో కారెక్టర్ పేరు గని. ఆ పేరునే ఇప్పుడు తన సినిమాకు టైటిల్‌గా పెట్టుకున్నాడు వరుణ్ తేజ్. అల్లు బాబీ నిర్మాతగా ఉన్నా.. కొడుకుకు అన్ని విధాలుగా వెనకుండి సాయం చేస్తున్నాడు అరవింద్. భీమ్లా నాయక్ రాదని క్లారిటీ వచ్చిన తర్వాత తమ సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేయబోతున్నట్లు కన్ఫర్మ్ చేసారు గని దర్శక నిర్మాతలు.

బాలు సినిమాలో పవన్ కళ్యాణ్ రెండో కారెక్టర్ పేరు గని. ఆ పేరునే ఇప్పుడు తన సినిమాకు టైటిల్‌గా పెట్టుకున్నాడు వరుణ్ తేజ్. అల్లు బాబీ నిర్మాతగా ఉన్నా.. కొడుకుకు అన్ని విధాలుగా వెనకుండి సాయం చేస్తున్నాడు అరవింద్. భీమ్లా నాయక్ రాదని క్లారిటీ వచ్చిన తర్వాత తమ సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేయబోతున్నట్లు కన్ఫర్మ్ చేసారు గని దర్శక నిర్మాతలు.

Varun Tej : మెగా హీరో వరుణ్‌తేజ్‌ (Varun Tej) ప్రస్తుతం గని అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈరోజు షూటింగ్‌ను పున: ప్రారంభించింది.

  మెగా హీరో వరుణ్‌తేజ్‌ (Varun Tej) ప్రస్తుతం గని అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయ్యేది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇక ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో చిత్రబృందం షూటింగ్‌ను రిస్టార్ట్ చేసింది. ఈరోజు నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ షెడ్యూల్‌తో సినిమా పూర్తి అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సింగ్ కి సంబంధించిన క్లైమాక్స్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు. వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ కనిపించనుంది. ఈ సినిమాతోనే తెలుగు తెరకి ఆమె పరిచయమవుతోంది. జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒక ప్రత్యేకమైన పాత్రలో నదియా కనిపించనుంది. గని సినిమాు అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.


  ఈ సినిమా దాదాపు రూ.35 కోట్లతో భారీగా తెరకెక్కుతోంది. ఇక ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని ప్రకటించింది చిత్రబృందం. వరుణ్ ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎఫ్ 3లో కూడా నటిస్తున్నారు. ఎఫ్ 3లో వరుణ్‌కు జంటగా మెహ్రీన్ నటిస్తుండగా.. మరో జంటగా వెంకటేష్ తమన్నాలు నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక తాజాగా వస్తున్న సమచారం మేరకు వరుణ్ మరో సినిమాలో కూడా నటిస్తున్నట్లు టాక్. చిరంజీవి మలయాళ రీమేక్‌లో వరుణ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. రారాజుగా వస్తున్న ఈ సినిమాలో చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. విద్యాబాలన్ మరో కీలకపాత్రలోకనిపించనుంది. అయితే ఈ సినిమాలో చిరంజీవి బాడీగార్డ్ పాత్రలో వరుణ్ కనిపించనున్నారట. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకుడు. ఈ సినిమా చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న ప్రారంభం కానుందని తెలుస్తోంది.

  ఈ సినిమాలతో పాటు వరుణ్ ప్రవీణ్‌ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు చెప్పిన స్టోరీ లైన్‌ నచ్చి వరుణ్‌ వెంటనే ఆ ప్రాజెక్టును ఓకే చేశాడట. పవర్ పుల్ కథతో వస్తున్న ఈ సినిమా షూటింగ్.. కథ ప్రకారం మొత్తం లండన్‌లోనే జరుపుకోనుందట.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Tollywood news, Varun Tej

  ఉత్తమ కథలు