బాక్సర్‌గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) ఓ డిఫరెంట్ రోల్లో నటించిన ‘గని’(Ghani).ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏప్రిల్ 8న విడుదలైన ఈ సినిమా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై తెరకెక్కించారు. ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ ఎంతో కష్టపడ్డాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో తన మేకోవర్ మార్చుకుని ఈ చిత్రంలో నటించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన గని.. మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘గని’ (Ghani ott release)ఓటీటీ రిలీజ్‌కి సంబంధించి అప్ డేట్ బయటకొచ్చింది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్(Saiee Manjrekar) హీరోయిన్గా నటించింది.
తాజాగా ‘గని’ (Ghani)ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. ‘ఆహా’ ప్లాట్‌ఫామ్ వేదికగా ఈ నెల 22న ‘గని’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక, ఈ సినిమా విషయానికి వస్తే వరుణ్‌తేజ్‌కు జోడీగా నటి సయీ మంజ్రేకర్ నటించారు. నదియా(Nadiya), ఉపేంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి(Suneel Shetty) కీలకపాత్రలు పోషించారు. అల్లు బాబీ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. గని స్ట్రీమింగ్ హక్కులని అచ్చ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా కొనుగోలు చేసింది. సినిమా నిర్మాతలు, ఆహా సంస్థ ఇద్దరూ అల్లు కాంపౌండ్ వారే కావడంతో ఈ సినిమా డిజిటల్ హక్కులు ఆహా వద్దకు చేరాయి. థియేటర్స్‌లో ఈ మూవీ రిలీజ్ అయిన మూడు వారాలకు అంటే ఆహా వేదికపై స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఓ టాక్ బయటకొచ్చింది.ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది.
ఆర్ఆర్ఆర్(RRR) ఇంకా థియేటర్లలోనే ఉండటం, వారం రోజుల్లో బీస్ట్, కెజిఎఫ్-2 సినిమాలు రిలీజ్‌కి ఉండటంతో ఈ సినిమాను త్వరగానే ఓటీటీ(OTT)లో రిలీజ్ చేసేందుకు సినిమా మేకర్ రెడీ అయిపోయారు. ఈ సినిమా ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సర్ కావాలని కలలు కనే ఓ యువకుడు.. కుటుంబం, ప్రత్యర్థుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? తల్లికిచ్చిన మాట కోసం అతడు బాక్సింగ్‌కు దూరమవుతాడా? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అనుకున్న హిట్ కొట్టలేకపోయింది.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.