Varun Tej | Ghani Teaser : మెగా హీరో వరుణ్‌తేజ్ (Varun Tej) ప్రస్తుతం గని అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇటీవల వరుణ్ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.
మెగా హీరో వరుణ్‌తేజ్ (Varun Tej) ప్రస్తుతం గని అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇటీవల వరుణ్ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. సోషల్ మీడియా లో విశేష స్పందన లభిస్తోంది. అంతేకాదు ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. దీంతో ఈ టీజర్‌కు 1.1 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇక ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాను డిసెంబర్ 24న విడుదల చేయాలనీ ప్లాన్ చేసింది చిత్రబృందం. కాగా ఈ చిత్రం కొన్ని కారణాల వలన విడుదల పడింది. అయితే తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించింది టీమ్. ఆల్రెడీ షూటింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని మేకర్స్ ఓటిటి లో రిలీజ్ చేస్తారు అని పలు ఊహాగానాలు బయటకి వచ్చినా వాటిని బ్రేక్ చేస్తూ ఈ చిత్రం కేవలం థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుంది అని కన్ఫర్మ్ చేసింది చిత్రబృందం. గని సినిమాను మార్చ్ నెల 18న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించింది టీమ్. గని సినిమాను కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో వరుణ్ ఫిజిక్ అదిరిందని అంటున్నారు నెటిజన్స్.
గనిలో వరుణ్ తేజ్‌కు జోడీగా సాయి మంజ్రేకర్ నటిస్తున్నారు. గెస్ట్ రోల్స్‌లో సునీల్ శెట్టి, ఉపేంద్ర, జగపతి బాబు కూడా నటిస్తున్నారు. ఒక ప్రత్యేకమైన పాత్రలో నదియా కనిపించనున్నారు. గని సినిమాను అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా దాదాపు రూ.35 కోట్లతో భారీగా తెరకెక్కుతోంది.
ఇక ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎఫ్ 3లో కూడా నటిస్తున్నారు. ఎఫ్ 3లో వరుణ్‌కు జంటగా మెహ్రీన్ నటిస్తుండగా.. మరో జంటగా వెంకటేష్ తమన్నాలు నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్ మరింత కామెడీ ఉంటుందని.. పొట్టలు చెక్కలయ్యేలా అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేసారట. భార్యలు మితిమీరిన ఖర్చులతో చేసిన అప్పులు తట్టుకోలేక.. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి ఓ హోటల్ పెడతారు. అక్కడ్నుంచి వాళ్లకు ఎదురయ్యే సమస్యలు.. పడే పాట్లేఅనేది ఈ సినిమా కథ అంటున్నారు. అప్పులు తీర్చడానికి పడే తిప్పలు ఫన్నీగా చూపించబోతున్నారట దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక తాజాగా వస్తున్న సమచారం మేరకు వరుణ్ మరో సినిమాలో కూడా నటిస్తున్నట్లు టాక్. వరుణ్ ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు చెప్పిన స్టోరీ లైన్ నచ్చి వరుణ్ వెంటనే ఆ ప్రాజెక్టును ఓకే చేశారట. పవర్ పుల్ కథతో వస్తున్న ఈ సినిమా షూటింగ్.. కథ ప్రకారం మొత్తం లండన్‌లోనే జరుపుకోనుందట.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.