Varun Tej - Ghani Pre Release Business : మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ (Varun Tej) ప్రస్తుతం గని అనే స్పోర్ట్స్ డ్రామాలో నటించిన సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమా దాదాపు రూ.35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇక ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. రీసెంట్గా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 2న విశాఖపట్నంలో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ఘనంగా జరిగింది. విడుదలకు రెడీగా ఉన్న ఈ సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ కలిపి రూ. 25 కోట్లకు అమ్ముడు పోయినట్టు సమాచారం.
వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం తనను తాను మార్చుకున్న విధానం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్.. సిక్స్ ప్యాక్ బాడీ కోసం బాగానే చెమటోడ్చాడు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్.. ఏ విధంగా కష్టపడ్డాడనే విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసారు. తాజాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా..
నైజాం (తెలంగాణ): రూ. 8 కోట్లు
సీడెడ్ (రాయలసీమ): రూ. 3.50 కోట్లు
ఆంధ్ర ప్రదేశ్ : రూ. 9.50 కోట్లు
తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ : రూ. 21.00 కోట్లు కర్ణాటక మరియు రెస్టాఫ్ భారత్ : రూ. 2.50 కోట్లు ఓవర్సీస్ : రూ. 1.80 కోట్లు టోటల్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్ .. రూ. 25.30 కోట్లు బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 26.30 కోట్లు రాబట్టాలి.
ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు నటించారు.’గని’ మూవీకి సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సినిమా టోటల్ రన్ టైమ్ 2 గంటల 31 నిమిషాల 17 సెకన్లు ఉంది. ‘గని’ సినిమాను కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించారు.
ఇక వరుణ్ తేజ్ ‘గని సినిమాతో పాటు వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎఫ్ 3లో కూడా నటిస్తున్నారు. ఎఫ్ 3లో వరుణ్‌కు జంటగా మెహ్రీన్ నటిస్తుండగా.. మరో జంటగా వెంకటేష్ తమన్నాలు నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్ మరింత కామెడీ ఉంటుందని.. పొట్టలు చెక్కలయ్యేలా అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేసారట. భార్యలు మితిమీరిన ఖర్చులతో చేసిన అప్పులు తట్టుకోలేక.. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి ఓ హోటల్ పెడతారు. అక్కడ్నుంచి వాళ్లకు ఎదురయ్యే సమస్యలు.. పడే పాట్లేఅనేది ఈ సినిమా కథ అంటున్నారు. ఈ సినిమాను మే 27న ఎన్టీఆర్ జయంతి రోజున విడుదల చేస్తున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.