Varun Tej - Ghani :మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ (Varun Tej) ప్రస్తుతం గని అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమా దాదాపు రూ.35 కోట్లతో భారీగా తెరకెక్కుతోంది. ఇక ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని ప్రకటించింది చిత్రబృందం. ఆ తర్వాత ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రటించారు. ఆ తర్వాత ‘అన్నాత్తే’ (పెద్దన్న) పోటీలో ఉండటంతో ఈ సినిమాను డిసెంబర్ 3కు రీ షెడ్యూల్ చేసారు. కానీ డిసెంబర్ 2న బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ మూవీ విడుదల చేస్తున్నట్టు ప్రకటించడంతో .. అల్లు అరవింద్.. తన తనయుడు అల్లు బాబీ నిర్మాతగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 24కు మరోసారి పోస్ట్ చేసారు.
ఇక అల్లు అరవింద్.. బాలయ్యతో ‘ఆహా’ అనే టాక్ షో చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో బాలయ్య సినిమాతో తన తనయుడు నిర్మాతగా నిర్మిస్తోన్న చిత్రాన్ని పోటీలో లేకుండా చేసారు. ఏమైనా అల్లు అరవింద్ సినిమాల విడుదల విషయంలో కూడా పక్కా ఉంటారనే విషయం మరోసారి స్పష్టం అయింది.
The release of Mega Prince @IAmVarunTej's #Ghani is being rescheduled! ?
A new release date will be announced soon, the film will release only in THEATRES!✨@IamJagguBhai @nimmaupendra @SunielVShetty @saieemmanjrekar @dir_kiran @MusicThaman @george_dop @sidhu_mudda @Bobbyallu pic.twitter.com/DlzK0qlkED
— Geetha Arts (@GeethaArts) December 10, 2021
ఇక డిసెంబర్ 17న అల్లు అరవింద్ రెండో తనయుడు అల్లు అర్జున్.. ‘పుష్ప’ మూవీ మొదటి భాగం విడుదలవుతోంది. ఈ మూవీ విడుదలైన వారం రోజులకు తన నిర్మాణంలో తెరకెక్కిన ‘గని’ చిత్రం విడుదల చేస్తే థియేటర్స్ ప్రాబ్లెమ్స్‌తో పాటు ’పుష్ప’కు కేటాయించిన కొన్ని థియేటర్స్‌ను దీనికి కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పుడుతోంది. మరోవైపు డిసెంబర్ 24న నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ విడుదలకు రెడీగా ఉంది. ఆ తర్వాత వరుసగా ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’, ‘భీమ్లా నాయక్’ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి.
HBD Nabha Natesh : హ్యాపీ బర్త్ డే నభా నటేష్.. ఇస్మార్ట్ పోరి గురించి ఈ నిజాలు తెలుసా..
ఇంత పోటీలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గని’ మూవీ విడుదల చేయడం రిస్క్‌తో కూడుకున్నది కావడంతో అల్లు అరవింద్.. ‘గని’ మూవీని టాలీవుడ్‌లో ఎలాంటి పోటీ లేని టైమ్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే మూడోసారి వరుణ్ తేజ్.. ‘గని’ మూవీని విడుదలను పోస్ట్ పోన్ చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదిని త్వరలో అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.
Rajinikanth: వివిధ ఇండస్ట్రీ స్టార్ హీరోలతో రజినీకాంత్ చేసిన ఈ మల్టీస్టారర్ మూవీలు తెలుసా..
ఇక వరుణ్ తేజ్ ‘గని’ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే విడుదలైన (Ghani Teaser) టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా చరణ్ వాయిస్ ఓవర్‌లో వచ్చిన కొన్ని మాటలు బాగున్నాయి. నెటిజన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఒక్కరి కథలో కష్ఠాలు ఉంటాయి.. కన్నీళ్లు ఉంటాయి.. కోరికలు ఉంటాయి.. కోపాలు ఉంటాయి.. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ ఛాంపియన్ అవ్వాలని ఉంటుంది. అయితే ఛాంపియన్ అయ్యేది ఒక్కడే.. ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి.. అంటూ సాగో వాయిస్ ఓవర్ నెటిజన్స్‌ను ఆకర్షిస్తోంది. ఇక చివరగా.. ఆటలో ఆడినా ఓడినా రికార్డ్స్‌లో ఉంటాం.. కానీ గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటావు.. అంటూ డైలాగ్ వదిలారు. గని సినిమాను కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. వరుణ్ ఫిజిక్ అదిరిందని అంటున్నారు నెటిజన్స్.
Katrina - Vicky Kaushal : విక్కీ కౌశల్, కత్రినా సహా ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లీళ్లు చేసుకున్న హీరో, హీరోయిన్లు ఇంకెరున్నారంటే..
గనిలో వరుణ్ తేజ్‌కు జోడీగా సాయి మంజ్రేకర్ నటిస్తున్నారు. గెస్ట్ రోల్స్‌లో సునీల్ శెట్టి, ఉపేంద్ర, జగపతి బాబు కూడా నటిస్తున్నారు. ఒక ప్రత్యేకమైన పాత్రలో నదియా కనిపించనున్నారు. గని సినిమాను అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu aravind, Geetha Arts, Ghani Movie, Tollywood, Varun Tej