Gaddhalakonda Ganesh twitter review : గద్దలకొండ గణేష్ సినిమా ఎలా ఉందంటే..

#GaddhalakondaGanesh twitter review : వరుణ్ తేజ్.. హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న 'గద్దలకొండ గణేష్' (వాల్మీకి) చిత్రం ఈ రోజు ప్రపంచవ్యప్తంగా విడుదలౌతోంది.

news18-telugu
Updated: September 20, 2019, 8:41 AM IST
Gaddhalakonda Ganesh twitter review : గద్దలకొండ గణేష్ సినిమా ఎలా ఉందంటే..
వరుణ్ తేజ్ (Twitter/Photo)
  • Share this:
#GaddhalakondaGanesh twitter review : వరుణ్ తేజ్.. హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న 'గద్దలకొండ గణేష్' (వాల్మీకి) చిత్రం  ఈ రోజు ప్రపంచవ్యప్తంగా విడుదలౌతోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు.  తమిళ నటుడు అధర్వ  మరో కీలక పాత్ర పోషించారు. శ్రీదేవిగా పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించారు. మొదట ఈ చిత్రానికి ‘వాల్మీకి’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే సినిమా టైటిల్‌ను మార్చాలంటూ బోయ, వాల్మీకి సంఘాలు ఆందోళనకు చేయడం, దీంతో కర్నూలు, అనంతపురం జిల్లాల కలెక్టర్స్ సినిమా విడుదల ఆపాలని ఆదేశించడంతో దర్శక, నిర్మాతలు అప్పటికప్పుడు వాల్మీకి సినిమా టైటిల్‌ను ‘గద్దలకొండ గణేష్’గా మార్చారు.


అది అలా ఉంటే.. ఈ సినిమాను అమెరికాలోని పలు నగరాల్లో ప్రీమియర్స్ ను వేసింది చిత్రబృందం. దీంతో టాక్ బయటకు వచ్చేసింది. సినిమాను అక్కడ చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికల ద్వారా సినిమాపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.  గద్దలకొండ గణేష్‌గా వరుణ్ ఎలా చేశాడు.. సినిమాలో మార్పులు గద్దలకొండ గణేష్‌కు ఉపయోగపడ్డాయా... సినిమాపై వారి కామెంట్స్, సినిమా టాక్ ఎంటో చూస్తే.. గద్దలకొండ గణేష్.. తమిళ  రీమేక్ సినిమా అయినప్పటికీ ఒరిజినల్ కథలో ఉన్న పాత్ర కంటే విభిన్నంగా వరుణ్ అదరగొట్టాడని సమాచారం. హరీష్ శంకర్, వరుణ్‌ను మాస్  లుక్‌లో సూపర్‌గా చూపించాడని టాక్. పూజా హెగ్డే కూడా తన రేంజ్‌కి తగ్గట్టు ఉన్నది కొద్దిసేపైనా అదరగొట్టిందని ముఖ్యంగా ఈ జంట ఆడిపాడిన అప్పటి హిట్ సాంగ్ 'వెల్లువచ్చి గోదారమ్మా' పాటలో ఇద్దరూ చంపేశారని తెలుస్తోంది. మరో ముఖ్య పాత్రలో నటించిన అధర్వ కూడా బాగానే చేశాడని తెలుస్తోంది. దీనికి తోడు మిక్కీ జే మేయర్ సంగీతం, బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయిందని టాక్.












Published by: Suresh Rachamalla
First published: September 20, 2019, 7:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading