VARUN TEJ F2 MOVIE BEATS RAM CHARAN VINAYA VIDHEYA RAMA SANKRANTI 2019
రామ్ చరణ్‌కు షాక్ ఇచ్చిన వరుణ్ తేజ్.. అంతేగా అంతేగా..
రామ్ చరణ్ వరుణ్ తేజ్
వరుణ్ తేజ్‌కు ఏదో ఒక వరం వెంట ఉన్నట్లుంది. స్టార్ హీరోలతో పోటీ పడినా కూడా ఎప్పుడు ఈయనే గెలుస్తున్నాడు. ముఖ్యంగా మెగా హీరోలతో యుద్ధం అన్నప్పుడు వరుణ్ తేజ్‌కు ఏదో వరం వెంట ఉంటుంది. ఇప్పుడు ఏకంగా రామ్ చరణ్ సినిమానే ఓడించి సంచలనం సృష్టించాడు వరుణ్ తేజ్.
వరుణ్ తేజ్‌కు ఏదో ఒక వరం వెంట ఉన్నట్లుంది. స్టార్ హీరోలతో పోటీ పడినా కూడా ఎప్పుడు ఈయనే గెలుస్తున్నాడు. ముఖ్యంగా మెగా హీరోలతో యుద్ధం అన్నప్పుడు వరుణ్ తేజ్‌కు ఏదో వరం వెంట ఉంటుంది. గతేడాది సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ఇంటలిజెంట్ సినిమాతో పోటీ పడ్డాడు వరుణ్ తేజ్. అప్పుడు వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఇంటలిజెంట్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కానీ తొలిప్రేమతో సాయిని ఓడించాడు మెగా వారసుడు. ఇప్పుడు ఏకంగా రామ్ చరణ్ సినిమానే ఓడించి సంచలనం సృష్టించాడు వరుణ్ తేజ్.
ఈ పండక్కి మెగా అన్నదమ్ముల మధ్య యుద్ధం బాగానే ఆసక్తి పుట్టించింది. అందరి అంచనాలు రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాపై ఉన్నాయి. అదే సమయంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఎఫ్2 సినిమాను కూడా ఎవరు తక్కువగా అంచనా వేయలేదు. అనిల్ రావిపూడి దర్శకుడు కావడంతో కచ్చితంగా ఈ చిత్రం బాక్సాఫీస్ సృష్టించడం ఖాయమని నమ్మకంతోనే ఉన్నారు డిస్ట్రిబ్యూటర్లు కూడా. ఇప్పుడు ఇదే జరిగింది. బోయపాటి శ్రీను తెరకెక్కించిన వినయ విధేయ రామ తొలిరోజే డిజాస్టర్ అని తేలిపోయింది.
ఎఫ్2లో వెంకటేష్, వరుణ్ తేజ్
దాంతో ఎఫ్ 2 పండగ చేసుకుంటుందిప్పుడు. ఈ చిత్రం రొటీన్ కథతోనే వచ్చినా కూడా అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ బాగా కలిసొస్తుంది. ముఖ్యంగా వెంకటేష్ కామెడీ దీనికి ప్రాణం. వరుణ్ తేజ్ కూడా తెలంగాణా స్లాంగ్‌లో అదరగొట్టాడు. ప్రస్తుతం ఉన్న టాక్ ప్రకారం చూస్తుంటే ఈ పండగ ఎఫ్2 పేరు మీద వెళ్లిపోయేలా కనిపిస్తుంది. అలా అన్నయ్యపై గెలిచి విజేతగా నిలిచాడు వరుణ్ తేజ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.