అవును మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. తండ్రి నాగబాబు బాటలో అభిమానులతో నిన్న చిట్‌చాట్ చేసాడు. రీసెంట్గా నాగబాబు కూడా అభిమానులతో సోసల్ మీడియా వేదికగా వాళ్లతో తన అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. తాజాగా వరుణ్ తేజ్.. లాక్డౌన్ కారణంగా అభిమానులతో నిన్న రాత్రి అభిమానులతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఐతే.. ఈ చిట్‌చాట్‌లో డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా వరుణ్ తేజ్ ను ఈ చాట్ సమయంలో ఓ ప్రశ్న అడిగారు. హాయ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. నీ లాస్ట్ క్రష్ ఎవరు ? అనే ప్రశ్న అడిగాడు. ధానికి వరుణ్ అంతే తెలివిగా సమాధానం చెప్పాడు. నా లాస్ట్ క్రష్ ఎవరంటే.. నాతో చివరి సినిమా చేసిన దర్శకుడు అని వరుణ్ తెలిపాడు. వరుణ్ తేజ్ చివరగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘గద్దలకొండ గణేష్’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా. అలా నా లాస్ట్ క్రష్ నువ్వే అంటూ ఇన్ డైరెక్ట్‌గా హరీష్ శంకరే అంటూ సమాధానమిచ్చాడు. మొత్తానికి నిన్న జరిగిన చిట్‌ఛాట్‌లో వరుణ్ తేజ్.. అభిమాలకు పలు ఆసక్తికర సమాధానాలు చెప్పాడు.
Heyyyyy Mega Prince @IAmVarunTej Who is ur last Crush #AskVarun 😍😍
— Harish Shankar .S (@harish2you) April 14, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Harish Shankar, Nagababu, Tollywood, Varun Tej