Home /News /movies /

పవన్ కళ్యాణ్ నటించిన ఆ సినిమాను ఎన్నోసార్లు చూసానో లెక్కే లేదు.. వరుణ్ తేజ్..

పవన్ కళ్యాణ్ నటించిన ఆ సినిమాను ఎన్నోసార్లు చూసానో లెక్కే లేదు.. వరుణ్ తేజ్..

పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్

పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్

బాబాయి పవన్ కళ్యాణ్ నటించిన ఆ సినిమాను ఎన్ని సార్లు చూసానే లెక్కేలేదు అంటూ అభిమానులతో చెప్పాడు వరుణ్ తేజ్. తాజాగా వరుణ్ తేజ్.. లాక్‌డౌన్  కారణంగా ఇంట్లో ఉండటంతో అభిమానులతో ట్విట్టర్ వేదికగా చిట్‌చాట్ చేసాడు.

    బాబాయి పవన్ కళ్యాణ్ నటించిన ఆ సినిమాను ఎన్ని సార్లు చూసానే లెక్కేలేదు అంటూ అభిమానులతో చెప్పాడు వరుణ్ తేజ్. తాజాగా వరుణ్ తేజ్.. లాక్‌డౌన్  కారణంగా ఇంట్లో ఉండటంతో అభిమానులతో ట్విట్టర్ వేదికగా చిట్‌చాట్ చేసాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.ఈ సందర్భంగా ఓ అభిమాని మీకు ఎలాంటి సినిమాలు నచ్చతాయి అన్నదానికి యాక్షన్ సినిమాలు అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు తమ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఒక్కో మాటలో చెప్పుకొచ్చాడు. పెదనాన్న చిరంజీవి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తారు. నాన్న నాగబాబు నా బలం. ఇక పవన్ కళ్యాణ్ నిజాయితీ మారు పేరు అంటూ పేర్కొన్నాడు. రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరూ మంచి హార్ట్ వర్కర్స్ వాళ్ల నుంచి సినిమా కోసం ఎంతలా కష్టపడాలో నేర్చుకున్నాన్నారు. ఇక బాలీవుడ్‌లో తన ఫేవరేట్ హీరో షారుఖ్ ఖాన్ అని చెప్పారు. మరోవైపు కామిక్ హీరోల్లో బాట్ మేన్ ఆల్ టైమ్ ఫేవరేట్ అని చెప్పాడు.

    mega family heroes chiranjeevi pawan kalyan ram charan not playing real life characters in silver screen,megastar chiranjeevi,mega family heroes,venky mama moview review,venkatesh naga chaitanya venky mama,naga chaitanya nagarjuna anr,nandamuri family,balakrishna ntr,Ghattamaneni family,mahesh babu krishna,krishnam raju,prabhas,pawan kalyan,tollywood,telugu cinema,వెంకీమామ,వెంకీ మామ మూవీ రివ్యూ,వెంకటేష్ నాగ చైతన్య,నాగ చైతన్య నాగార్జున ఏఎన్నార్,కృష్ణ మహేష్ బాబు,ఘట్టమనేని ఫ్యామిలీ,అక్కినేని ఫ్యామిలీ,దగ్గుబాటి ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ,బాలకృష్ణ ఎన్టీఆర్,మెగా ఫ్యామిలీ,కొణిదెల ఫ్యామిలీ,చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్
    మెగా ఫ్యామిలీ హీరోలు (Facebook/Photos)


    ఇక క్వారంటైన్‌లో ఇపుడు స్నూకర్ ఆడుతూ టైమ్‌పాస్ చేస్తున్నట్టు పేర్కొన్నాడు. మరోవైపు ఆన్‌లైన్‌లో గిటార్ నేర్చుకుంటున్నట్టు చెప్పారు. నా నెక్ట్స్ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో చేస్తున్నాను. ఈ సందర్భంగా ఓ కోచ్‌ను నాతో పాటు ఉంటున్నాడు. ఆయనతో రోజు బాక్సింగ్ క్లాసులు తీసుకుంటున్నట్టు పేర్కొన్నాడు. ఇక లాస్ట్ క్రష్ ఎవరన్న దర్శకుడు హరీష్ శంకర్ ప్రశ్నకు తనతో లాస్ట్ సినిమా గద్దలకొండ గణేష్ సినిమా తీసిన హరీష్ శంకర్ పేరును చెప్పకనే చెప్పాడు.  మరోవైపు మంచి కథ దొరికితే సాయి ధరమ్ తేజ్‌తో పాటు మిగతా మెగా హీరోలందరితో సినిమాలు చేస్తానన్నాడు. త్వరలో ఎఫ్ 3 సంబంధించిన అప్‌డేట్ ఇస్తానన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో ఏ సినిమా ఫేవరేట్ అడగగా.. తమ్ముడు సినిమా పేరు చెప్పాడు. ఆ సినిమాను ఎన్ని సార్లు చూసానో లెక్కే అంటూ చెప్పడం విశేషం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Covid-19, Pawan kalyan, Tollywood, Varun Tej

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు