నాగ‌బాబు కోసం వ‌రుణ్ తేజ్.. నాన్న‌కు ప్రేమ‌తో అంటూ ఎన్నిక‌ల ప్ర‌చారం..

త‌మ‌కు రాజ‌కీయాలు రావు రావు అంటూనే మెగా కుటుంబం బాగానే పాలిటిక్స్ చేస్తుంది. పైగా మ‌న హీరోలు కూడా పొలిటిక‌ల్ హీట్ ముందు త‌ల వంచేస్తున్నారు. ఇప్పుడు మెగా హీరోలు కూడా మ‌రోసారి రోడ్డెక్కి త‌మ బాబాయ్ జ‌న‌సేన పార్టీకి ఓటేయండంటూ కోరుకుంటున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 5, 2019, 10:26 PM IST
నాగ‌బాబు కోసం వ‌రుణ్ తేజ్.. నాన్న‌కు ప్రేమ‌తో అంటూ ఎన్నిక‌ల ప్ర‌చారం..
నాగబాబు వరుణ్ తేజ్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 5, 2019, 10:26 PM IST
త‌మ‌కు రాజ‌కీయాలు రావు రావు అంటూనే మెగా కుటుంబం బాగానే పాలిటిక్స్ చేస్తుంది. పైగా మ‌న హీరోలు కూడా పొలిటిక‌ల్ హీట్ ముందు త‌ల వంచేస్తున్నారు. ఇప్పుడు మెగా హీరోలు కూడా మ‌రోసారి రోడ్డెక్కి త‌మ బాబాయ్ జ‌న‌సేన పార్టీకి ఓటేయండంటూ కోరుకుంటున్నారు. ఇప్పుడు వ‌రున్ తేజ్ ఇదే చేస్తున్నాడు. ఇన్నాళ్లూ ఈయ‌న అమెరికాలో త‌న నెక్ట్స్ సినిమా వాల్మీకి కోసం శిక్ష‌ణ తీసుకుంటున్నాడు. అక్క‌డ్నుంచి వ‌చ్చీ రాగానే తండ్రి నాగ‌బాబు కోసం న‌ర‌సాపురంలో ఎన్నిక‌ల ప్ర‌చారం మొద‌లు పెట్టాడు వ‌రుణ్ తేజ్.
Varun Tej Campaigning for Naga Babu and Pawan Kalyan in Bhimavaram, Narasapuram pk.. త‌మ‌కు రాజ‌కీయాలు రావు రావు అంటూనే మెగా కుటుంబం బాగానే పాలిటిక్స్ చేస్తుంది. పైగా మ‌న హీరోలు కూడా పొలిటిక‌ల్ హీట్ ముందు త‌ల వంచేస్తున్నారు. ఇప్పుడు మెగా హీరోలు కూడా మ‌రోసారి రోడ్డెక్కి త‌మ బాబాయ్ జ‌న‌సేన పార్టీకి ఓటేయండంటూ కోరుకుంటున్నారు. Varun Tej Campaigning,Varun Tej Campaigning for janasena,Varun Tej Campaigning naga babu,Varun Tej Campaigning pawan kalyan,Varun Tej Campaigning bhimavaram,Varun Tej Campaigning narasapuram,Varun Tej naga babu,Varun Tej janasena party,Varun Tej Campaigning janasena,Varun Tej niharika,telugu cinema,వరుణ్ తేజ్,వరుణ్ తేజ్ జనసేన పార్టీ,వరుణ్ తేజ్ నాగబాబు,వరుణ్ తేజ్ నరసాపురంలో ఎన్నికల ప్రచారం,తెలుగు సినిమా
వరుణ్ తేజ్ ఫైల్ ఫోటో

నాగ‌బాబు అక్క‌డ్నుంచి ఎంపి అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నాడు. 'జనసేన' పార్టీ నుంచి ఈయ‌న పోటీ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న ఏపీ ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నాడు. ఆయ‌న‌కు తోడుగా ఇప్పుడు మెగా హీరోలు కూడా ఒక్కొక్క‌రుగా బ‌య‌టికి వ‌స్తున్నారు. ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్, బ‌న్నీ లాంటి స్టార్స్ సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్ పార్టీకి మ‌ద్దతు ఇచ్చారు. ఇక ఇప్పుడు వ‌రుణ్ తేజ్ ఏకంగా రోడెక్కేసాడు. ఆయ‌న‌తో పాటు వ‌రుణ్ తేజ్ త‌ల్లి, చెల్లి కూడా అక్క‌డే ఉన్నారు. ప‌వ‌న్ పోటీ చేస్తున్న భీమ‌వ‌రంలో కూడా నిహారిక‌, వ‌రుణ్ తేజ్ ప్రచారం చేస్తున్నారు.

Varun Tej Campaigning for Naga Babu and Pawan Kalyan in Bhimavaram, Narasapuram pk.. త‌మ‌కు రాజ‌కీయాలు రావు రావు అంటూనే మెగా కుటుంబం బాగానే పాలిటిక్స్ చేస్తుంది. పైగా మ‌న హీరోలు కూడా పొలిటిక‌ల్ హీట్ ముందు త‌ల వంచేస్తున్నారు. ఇప్పుడు మెగా హీరోలు కూడా మ‌రోసారి రోడ్డెక్కి త‌మ బాబాయ్ జ‌న‌సేన పార్టీకి ఓటేయండంటూ కోరుకుంటున్నారు. Varun Tej Campaigning,Varun Tej Campaigning for janasena,Varun Tej Campaigning naga babu,Varun Tej Campaigning pawan kalyan,Varun Tej Campaigning bhimavaram,Varun Tej Campaigning narasapuram,Varun Tej naga babu,Varun Tej janasena party,Varun Tej Campaigning janasena,Varun Tej niharika,telugu cinema,వరుణ్ తేజ్,వరుణ్ తేజ్ జనసేన పార్టీ,వరుణ్ తేజ్ నాగబాబు,వరుణ్ తేజ్ నరసాపురంలో ఎన్నికల ప్రచారం,తెలుగు సినిమా
వరుణ్ తేజ్ ఫైల్ ఫోటో

ఇప్పుడు ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. వ‌రుణ్ తేజ్ కోసం అభిమానులు కూడా బాగానే బ‌య‌టికి వ‌చ్చారు. అయితే ఇందులో ఎంత‌మంది ఓట్లు వేస్తార‌నేది మాత్రం ఆస‌క్తిక‌రంగా మారింది. ఎందుకంటే తాను స్టార్ ప‌వ‌ర్ న‌మ్ముకోన‌ని ఈ మ‌ద్యే ప‌వ‌న్ చెప్పాడు. హీరోల‌ను చూడ్డానికి వ‌స్తారు కానీ ఓట్లేయ‌రంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. మ‌రి ఇప్పుడు వ‌రుణ్ తేజ్ చేస్తున్న ప్ర‌చారం కూడా ఇలాగే మిగిలిపోతుందా లేదంటే నాగ‌బాబుకు ప‌నికొస్తుందా చూడాలి.

First published: April 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...