చిరంజీవిని వెనక్కి నెట్టేసిన వరుణ్ తేజ్.. పెదనాన్నకు అబ్బాయి ఝలక్..

మెగాస్టార్ చిరంజీవిని.. ఆయన తమ్ముడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ వెనక్కి నెట్టేసాడు.

news18-telugu
Updated: November 21, 2019, 9:33 AM IST
చిరంజీవిని వెనక్కి నెట్టేసిన వరుణ్ తేజ్.. పెదనాన్నకు అబ్బాయి ఝలక్..
చిరంజీవి,వరుణ్ తేజ్ (File Photos)
  • Share this:
మెగాస్టార్ చిరంజీవిని.. ఆయన తమ్ముడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ వెనక్కి నెట్టేసాడు. తాజాగా చిరంజీవి హీరోగా రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. అమ్మిన రేటు ప్రకారం చూస్తుంటే చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కాలేదు ఈ చిత్రం. తెలుగు రాష్ట్రాల్లో రూ.106 కోట్ల మార్క్ షేర్‌ను అందుకుంది సైరా నరసింహారెడ్డి.  మొత్తంగా రూ.240 కోట్ల గ్రాస్.. రూ. 143 కోట్లు షేర్ ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది సైరా. ఓవరాల్‌గా చూసుకుంటే సైరా చిరంజీవికి నిరాశనే మిగిల్చింది.ఈ చిత్రాన్ని దాదాపు రూ. 188 కోట్లకు పైగానే నిర్మాతలు అమ్మారు. తెలుగులో మాత్రమే సైరా మంచి వసూళ్లు సాధించింది. ఇక్కడ 106 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది. ఇఒకట్రెండు చోట్ల మాత్రమే సైరా బ్రేక్ ఈవెన్ అయి లాభాలు తీసుకొచ్చింది. మిగిలిన చోట్ల నష్టాలు తప్పలేదు.

varun tej beats his uncle megastar chiranjeevi here are the details,chiranjeevi,varun tej,chiranjeevi varun tej,chiranjeevi sye raa narasimha reddy varun tej f2,f2 beats sye raa narasimha reddy,varun tej chiranjeevi ram charan,sye raa,sye raa full collections,sye raa movie closing collections,sye raa narasimha reddy 50 days collections,sye raa 50 days,sye raa 50 days centers,sye raa final collections,sye raa narasimha Reddy final worldwide collections,sye raa narasimha reddy closing business,sye raa narasimha reddy worldwide latest collections,sye raa narasimha reddy movie,sye raa narasimha reddy 50 days collections,sye raa narasimha reddy movie 50 days collections,sye raa narasimha reddy collections till now,sye raa ww collections,sye raa narasimha reddy movie worldwide collections,sye raa narasimha reddy movie collections,sye raa narasimha reddy movie chiranjeevi,sye raa narasimha reddy collections,sye raa narasimha reddy movie ww collections,telugu cinema,సైరా నరసింహా రెడ్డి,సైరా కలెక్షన్స్,సైరా సినిమా ఫైనల్ కలెక్షన్స్,సైరా వరల్డ్ వైడ్ కలెక్షన్స్,సైరా 50 రోజుల కలెక్షన్స్,తెలుగు సినిమా,వరుణ్ తేజ్,సైరా నరసింహారెడ్డి,సైరా నరసింహారెడ్డి వర్సెస్ ఎఫ్2,వరుణ్ తేజ్ చిరంజీవి
‘సైరా నరసింహారెడ్డి’వర్సెస్ ఎఫ్ 2 (Twitter/Photo)


ఇక మిగిలిన భాషల్లో అయితే ‘సైరా నరసింహారెడ్డి’ దారుణంగా నిరాశ పరిచింది. ఓవర్సీస్‌లో అయితే పరిస్థితి మరీ దారుణం. అక్కడ 2.5 మిలియన్ దగ్గరే ఆగిపోయింది ఈ చిత్రం. హిందీలో అయితే కనీస స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది ఈ చిత్రం. ఫుల్ రన్ కలిపితే కనీసం 8 కోట్లు కూడా తీసుకురాలేదు. మొత్తంగా ఈ సినిమా 33 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. 2019లో విడుదలైన సినిమాల్లో మూడో స్థానాన్ని దక్కించుకుంది. సైరా కంటే మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా 110 సెంటర్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. వరుణ్ తేజ్ సీనియర్ హీరో వెంకటేష్‌తో కలిసి నటించిన f2  సినిమా 65 సెంటర్స్‌తో రెండో స్థానంలో నిలిచింది. నాగ చైతన్య సమంత నటించిన ‘మజిలీ’ మాత్రం 25 సెంటర్స్‌లో అర్ధ శతదినోత్సవాన్ని పూర్తి చేసుకుంది. మొత్తంగా చూసుకుంటే.. 50 రోజుల సెంటర్స్ విషయంలో పెదనాన్న మెగాస్టార్ చిరంజీవిని వరుణ్ తేజ్ బీట్ చేసాడు.



First published: November 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...