HOME »NEWS »MOVIE »varun tej actress disha patani life is in danger getting threat calls from pakistan mnj

Disha Patani: వరుణ్ తేజ్ హీరోయిన్‌కు పాక్ నుంచి కాల్స్.. చంపేస్తామంటూ బెదిరింపులు

Disha Patani: వరుణ్ తేజ్ హీరోయిన్‌కు పాక్ నుంచి కాల్స్.. చంపేస్తామంటూ బెదిరింపులు
Instagram

సినిమాల‌తో బిజీగా గ‌డిపేస్తూ త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతున్న బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టానీ(Disha Patani) లైఫ్ ఇప్పుడు డేంజ‌ర్‌లో ప‌డింది. ఆమెను చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్లు వ‌స్తున్నాయి. గ‌త కొన్ని రోజులుగా ఈ ఫోన్లు వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. ఆమెకు ఫోన్లు చేస్తోన్న కొంద‌రు దుండగులు నిన్ను చంపేస్తామని బెదిరిస్తున్న‌ట్లు స‌మాచారం

  • Share this:
    Disha Patani: సినిమాల‌తో బిజీగా గ‌డిపేస్తూ త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతున్న బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టానీ లైఫ్ ఇప్పుడు డేంజ‌ర్‌లో ప‌డింది. ఆమెను చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్లు వ‌స్తున్నాయి. గ‌త కొన్ని రోజులుగా ఈ ఫోన్లు వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. ఆమెకు ఫోన్లు చేస్తోన్న కొంద‌రు దుండగులు నిన్ను చంపేస్తామని బెదిరిస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే కార‌ణం చెప్పకుండానే వారు ఈ బెదిరింపులు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక దిశాకు మాత్ర‌మే కాదు.. ప‌లు పోలీస్ స్టేష‌న్‌ల‌కు కూడా ఆ దుండ‌గులు ఫోన్ చేస్తున్నార‌ట‌. త్వ‌ర‌గా డ‌బ్బులు వేయండి లేదంటే మీ అమ్మాయిని(దిశా ప‌టానీని ఉద్దేశించి) లేపేస్తామని బెదిరిస్తున్నారట‌. ఇక ఈ ఫోన్లను ట్రేస్ చేస్తే అవి పాకిస్తాన్ నుంచి వ‌చ్చిన ఫోన్ల‌ని తెలుస్తోంది. దీంతో పోలీసులు కూడా అప్ర‌మ‌త్త‌మై.. ఈ ఫోన్లు చేస్తున్న వారి గురించి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

    కాగా వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న లోఫ‌ర్ మూవీ ద్వారా హీరోయిన్‌గా కెరీర్‌ని ప్రారంభించింది దిశా ప‌టానీ. ఆ త‌రువాత హిందీలో ఆమెకు వ‌రుస అవ‌కాశాలు రావ‌డంతో.. ఇప్పుడు అక్క‌డే సెటిల్ అయ్యింది దిశా.





    ప్ర‌స్తుతం ఈ న‌టి, సల్మాన్‌ఖాన్ స‌ర‌స‌న రెండోసారి రాధేలో న‌టించింది. ఇప్ప‌టికే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇక ఇటీవ‌ల ఈ చిత్రం గురించి మాట్లాడిన స‌ల్మాన్ ఖాన్.. ఈ ఏడాది రంజాన్‌కి ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుందని వెల్ల‌డించారు. కాగా ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.
    Published by:Manjula S
    First published:January 21, 2021, 18:42 IST