Home /News /movies /

VARUN SANDESH INDUVADANA MOVIE REVIEW AND ITS MIXTURE OF HORROR COMEDY EMOTIONAL PK

Induvadana movie review: ‘ఇందువదన’ రివ్యూ.. ‘ఆత్మ’కథతో వచ్చిన వరుణ్ సందేశ్..

ఇందువదన రివ్యూ (induvadana movie)

ఇందువదన రివ్యూ (induvadana movie)

Induvadana movie review: ఒకప్పుడు వరసగా ప్రేమకథలతో ఆకట్టుకున్న వరుణ్ సందేశ్ (Varun Sandesh Induvadana movie review).. కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ స్క్రీన్ మీద కనిపించిన సినిమా ఇందువదన. రొటీన్ కథలకు భిన్నంగా.. కొత్త తరహా కథతో వచ్చాడని ఈ సినిమా ట్రైలర్, టీజర్ చూస్తుంటేనే అర్థమవుతుంది.

ఇంకా చదవండి ...
నటీనటులు: వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి, రఘుబాబు, ధన్ రాజ్, ఆలీ, నాగినీడు, సురేఖవాణి, తాగుబోతు రమేష్, మహేష్ విట్టా, పార్వతీశం తదితరులు
సంగీతం: శివ కాకాని
కథ: సతీష్ ఆకేటి
సినిమాటోగ్రఫి: బీ మురళీకృష్ణ
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత: మాధవి అదుర్తి
దర్శకత్వం: ఎం శ్రీనివాస రాజు

ఒకప్పుడు వరసగా ప్రేమకథలతో ఆకట్టుకున్న వరుణ్ సందేశ్.. కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ స్క్రీన్ మీద కనిపించిన సినిమా ఇందువదన. రొటీన్ కథలకు భిన్నంగా.. కొత్త తరహా కథతో వచ్చాడని ఈ సినిమా ట్రైలర్, టీజర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. మరి జనవరి 1న విడుదలైన ఇందువదన ప్రేక్షకులను ఆకట్టుకుందా.. ఏంటి ఈ సినిమా కథ..?

కథ:
వాసు ( వరుణ్ సందేశ్) ఓ ఫారెస్ట్ ఆఫీసర్. తన టీమ్‌(ధన్‌రాజ్, మహేష్ విట్టా, పార్వతీశం)తో కలిసి అక్కడ అడవుల్లో జరుగుతున్న అక్రమ కలప స్మగ్లింగ్‌ ఆడ్డుకొనేందుకు డ్యూటీ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే అడవిలోనే ఉండే గిరిజన యువతి ఇందు (ఫర్నాజ్ శెట్టి) ప్రేమలో పడతాడు. ఆమెను చూడగానే వాసు మనసులో చోటు ఇచ్చేస్తాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ కులం కారణంగా వాసు, ఇందు ప్రేమను పెద్దలు నిరాకరిస్తారు. అదే సమయంలో ఎవరూ ఊహించని రీతిలో ఇందు హత్యకు గురవుతుంది. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని దారుణంగా చంపేసిన తర్వాత వాసు పరిస్థితి ఏంటి.. ఎలా రియాక్ట్ అవుతాడు.. ఆ తర్వాత ఏం జరిగింది.. అసలు ఎవరు చంపారు.. ఇందును చంపిన వాళ్లపై వాసు పగ తీర్చుకున్నాడా లేదా అనేది అసలు కథ..

Movie ticket rate in Multiplex: 330 రూపాయలు.. చిన్న సినిమాలను చంపడం కాకపోతే ఏంటిది..?


కథనం:
ఇందువదన రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు.. చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తుండటంతో విభిన్నంగా ఉండే కథనే ఎంచుకున్నాడు వరుణ్ సందేశ్. ఇందుపై దాడి చేయడం.. అడవుల్లో మాఫియా ఎటాక్ లాంటి ఆసక్తికర అంశాలతో కథ ఎమోషనల్‌గా మొదలవుతుంది. ఆ తర్వాత నేరుగా కథలోకి వెళ్లిపోయాడు దర్శకుడు ఎమ్మెస్సార్. అక్కడ్నుంచి ఫస్టాఫ్ అంతా వాసు, ఇందు ప్రేమ సన్నివేశాలు రాసుకున్నాడు. ఈ సన్నివేశాలు పర్లేదు అనిపిస్తాయి. అడవిలోనే సాగే కథ కావడంతో అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఫారెస్ట్ ఆఫీసర్, గిరిజిన యువతి కథ అంటే గతంలో కొన్ని తెలుగు సినిమాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇందువదన కథ కూడా మొదలవుతుంది. కానీ ఆ ఒక్క పాయింట్ తప్పితే మిగిలిన కథ వేరుగా ఉంటుంది. ఇంటర్వెల్‌‌కు ముందు మంచి ట్విస్టుతో సెకండాఫ్‌పై ఆసక్తి పెంచేసాడు దర్శకుడు.

Radhe Shyam release date: ‘RRR’ సంగతి సరే.. ఇంతకీ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ జనవరి 14న వస్తుందా..?


హీరోయిన్ చనిపోయిన తర్వాత ఆత్మగా మారడం.. అక్కడ్నుంచి వరుణ్ సందేశ్ అనుభవాలు కొత్తగా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో మహేష్ విట్టా, పార్వతీశం, ధన్‌రాజ్ కామెడీ అక్కడక్కడా పర్లేదు అనిపిస్తుంది. సీనియర్ కమెడియన్ ఆలీని కూడా దర్శకుడు బాగానే వాడుకున్నాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఎమోషనల్‌గా సాగడంతో పాటు కాస్త థ్రిల్లింగ్‌గానూ ఉంటుంది. పైగా క్లైమాక్స్‌లో వరుణ్ సందేశ్ విషయంలో ఇచ్చే ట్విస్ట్ కూడా అనూహ్యంగానే ఉంటుంది. బ్రహ్మణ కులంలోని వరుణ్ సందేశ్.. గిరిజిన యువతితో ప్రేమలో పడితే.. ఆ తర్వాత అగ్రకులం వాళ్లు ఏం చేసారు అనేది కథ. రొటీన్‌గానే అనిపించే ఈ కథను తనదైన శైలిలో ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించాడు దర్శకుడు ఎమ్మెస్సార్..

నటీనటులు:
వరుణ్ సందేశ్‌ను ఇప్పటి వరకు కేవలం లవర్ బాయ్‌గానే చూపించారు దర్శకులు. కానీ ఇందువదన చిత్రంలో మాత్రం కొత్తగా కనిపించాడు.. గెటప్ నుంచి నటన వరకు వేరియేషన్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. యాక్షన్ సీన్స్ నుంచి ఎమోషనల్ వరకు బాగానే చేసాడు. హీరోయిన్ ఫర్నాజ్ శెట్టి సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. కొత్త హీరోయిన్ అయినా కూడా చాలా బాగుంది. గ్లామర్‌తోనే కాకుండా నటనతోనూ ఆకట్టుకుంటుంది. ఆలీ, మహేష్ విట్టా, పార్వతీశం, ధన్ రాజ్, తాగుబోతు రమేష్ కారెక్టర్స్ సరదాగా ఉన్నాయి. తమ పాత్రల పరిధి మేరకు పర్లేదనిపించారు. వరుణ్ సందేశ్‌కు తల్లిగా సురేఖ వాణి ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది.

Bangarraju Teaser: నాగార్జున ‘బంగార్రాజు’ టీజర్ అదరహో.. సంక్రాంతికి వచ్చేస్తున్న సోగ్గాడు..టెక్నికల్ టీమ్:
సంగీత దర్శకుడు శివ కాకాని మ్యూజిక్ బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రాఫర్ బీ మురళీకృష్ణ పనితీరు బాగుంది. సీన్స్ రిచ్‌గా అనిపిస్తాయి. నిర్మాత మాధవి ఆదుర్తి నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు శ్రీనివాస రాజు ఎంచుకొన్న పాయింట్ రెగ్యులర్‌గానే ఉన్నా కూడా దాన్ని తెరకెక్కించిన తీరు పర్లేదనిపిస్తుంది. ఉన్న పరిధిలోనే పాత్రలను బాగానే రాసుకున్నాడు. హీరోయిన్‌ కారెక్టర్ బాగా రాసుకున్నాడు దర్శకుడు. అలాగే వరుణ్‌ను కొత్తగా చూపించాడు. అయితే కథపై ఇంకాస్త వర్క్ చేసుంటే బాగుండేది. హార్రర్, థ్రిల్లర్స్ తెలుగులో చాలానే వచ్చాయి కాబట్టి అదే ఛాయలు ఇందులో కనిపించాయి. అదొక్కటే ఇందువదనకు మైనస్. ప్రమోషన్‌పై సినిమా ఫలితం ఆధారపడి ఉంది.

చివరగా ఒక్కమాట:
ఇందువదన రివ్యూ.. వరుణ్ సందేశ్ ‘ఆత్మ’ కథ..

రేటింగ్: 2.75/5
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Movie reviews, Telugu Cinema, Tollywood, Varun sandesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు