హోమ్ /వార్తలు /సినిమా /

Bhediya: వరుణ్ ధావన్, కృతి సనన్ బేడియా.. ఆకట్టుకుంటున్న తుంకేశ్వరి సాంగ్

Bhediya: వరుణ్ ధావన్, కృతి సనన్ బేడియా.. ఆకట్టుకుంటున్న తుంకేశ్వరి సాంగ్

Krithi sanon bediya Song (Photo News 18)

Krithi sanon bediya Song (Photo News 18)

Kriti Sanon Thumkeshwari song: యంగ్ హీరోహీరోయిన్లు వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటిస్తున్న కొత్త సినిమా బేడియా. తాజాగా ఈ సినిమా నుంచి తుంకేశ్వరి సాంగ్ రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

బాలీవుడ్ యంగ్ హీరోహీరోయిన్లు వరుణ్ ధావన్ (Varun Dhawan), కృతి సనన్ (Kriti Sanon) జంటగా నటిస్తున్న కొత్త సినిమా బేడియా (Bhediya). తొలి క్రియేచర్ కామెడీ మూవీగా దర్శకుడు అమర్ కౌశిక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జియో స్టూడియోస్ సమర్పణలో మ్యాడాక్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దినేష్ విజాన్ నిర్మాత. హిందీతో పాటు తెలుగులో "తోడేలు" టైటిల్ తో నవంబర్ 25న రిలీజ్ కాబోతోంది.

తాజాగా బేడియా సినిమా నుంచి తుంకేశ్వరి అనే పాటను (Thumkeshwari song) విడుదల చేశారు. డాన్స్ నెంబర్ గా కంపోజ్ చేసిన ఈ పాట ఫిల్మ్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. తుంకేశ్వరి పాటలో వరుణ్, కృతి డాన్సులు ఆకర్షణ అయ్యాయి. ఈ పాటలో స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ చేసిన స్పెషల్ అప్పీయరెన్స్ అసలైన హైలైట్ గా చెప్పుకోవచ్చు.

సచిన్ జిగర్ స్వరపర్చిన ఈ పాటకు గణేష్ ఆచార్య అదిరిపోయే స్టెప్పులు కొరియోగ్రాఫ్ చేశారు. ఈ పాటను తెలుగు లో కార్తీక్,అనూష మణి పాడారు. ఈ పాట గురించి వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. ఫ్లోర్ అదిరిపోయే డాన్స్ నెంబర్ ఇది. థియేటర్ లో ఆడియెన్స్ ఈ పాటకు స్టెప్పులేస్తారు. ఈ పాటలో పర్మార్మ్ చేయడాన్ని ఎంజాయ్ చేశాను. క్యాచీ లిరిక్స్, మంచి ట్యూన్ తో పాట మీకు బాగా నచ్చుతుంది. అన్నారు.' isDesktop="true" id="1486888" youtubeid="UKA31XLzsNA" category="movies">

కృతి సనన్ మాట్లాడుతూ.. వరుణ్ సరసన ఇలాంటి పాటలో కనిపించి చాలా రోజులవుతోంది. ఈ పాట షూటింగ్ టైమ్ ను ఎంజాయ్ చేశాం. ఇదొక మంచి ఎక్సీపిరియన్స్. అని చెప్పింది. తోడేలు గాయపర్చిన తర్వాత కథానాయకుడు భాస్కర్ ప్రవర్తనలో అనూహ్య మార్పులు వస్తాయి. అతను ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకునేందుకు అతని స్నేహితులు ప్రయత్నిస్తుంటారు. తోడేలులా మారిన అతని వైల్డ్ బిహేవియర్ కు కారణాలేంటో తెలుసుకునే క్రమం అంతా ఆసక్తికర అంశాలతో సర్ ప్రైజింగ్ గా సాగుతుంది. ఈ కథను అత్యున్నత సాంకేతిక విలువలతో హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ తో తెరకెక్కించారు. పాన్ ఇండియా స్థాయిలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ ఏడాది నవంబర్ 25న బేడియా/తోడేలు ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. త్రీడీ ఫార్మేట్ లోనూ ఈ సినిమా విడుదలవుతుండటం విశేషం.

First published:

Tags: Bollywood, Kriti Sanon, Varun Dhawan

ఉత్తమ కథలు