రివ్యూ : తోడేలు (బేడియా) (Thodelu )
నటీనటులు : వరుణ్ ధావన్, కృతి సనన్, దీపక్ దోబ్రియాల్, పాలిన్ కబాక్, అభిషేక్ బెనర్జీ తదితరులు..
ఎడిటర్: సంయుక్త కాజా
సినిమాటోగ్రఫీ: జిష్ణు భట్టాచార్య
సంగీతం: సచిన్ - జిగర్
నిర్మాత : జియో స్టూడియోస్, దినేష్ విజయన్ , తెలుగు వెర్షన్ అల్లు అర్జున్ (గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్)
దర్శకత్వం: అమర్ కౌశిక్
విడుదల తేది : 25/11/2022
ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్ (Varun Dhawan). ఎపుడు రొటిన్ సినిమాలే కాకుండా.. కాస్త విభిన్నంగా కొత్తగా ట్రై చేస్తున్నాడు. తాజాగా ఈయన ’బేడియా’ మూవీతో పలకరించారు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసారు. తెలుగులో తోడేలు పేరుతో డబ్ చేసారు. అల్లు అరవింద్ గీతా డిస్ట్రిబ్యూషన్ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేసారు. ఈ రోజు విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
భాస్కర్ (వరుణ్ ధావన్ ) ఓ రోడ్ కాంట్రాక్టర్. తన స్వార్ధం కోసం ప్రకృతి సహా ఇతరులు ఏమై పోయినా తనకు డబ్బు సంపాదనే ధ్యేయంగా బతికే మనిషి. అతను అరుణాచల్ ప్రదేశ్‌లో ఓ దట్టమైన కీకరాణ్యంలో ఓ రోడ్ కాంట్రాక్ట్ పని దక్కుతుంది. అక్కడ రహదారి వేయాలంటే అడవిలో ఉన్న చెట్లను నరికి రోడ్డు వేయాల్సిన పరిస్థితి. అక్కడ చెట్లను నిర్మూలించడానికి అక్కడ స్థానికులు ఒప్పుకోరు. ఈ ప్రయత్నాలు కొనసాగుతుండగా.. భాస్కర్‌ను ఓ తోడేలు కరుస్తోంది. ఆ తర్వాత అతనికి ఏమైంది. అక్కడ ప్రకృతికి ఎవరైనా అపకారం తలపెడితే ఓ వైరస్ దాడి చేస్తుందనే విశ్వాసం అక్కడ ప్రజల్లో ఉంటుంది. మరి ఏంటా వైరస్. తోడెలు కరిచిన భాస్కర్ పరిస్థితి ఏమైంది. అతనికి పశువుల వైద్యురాలైన కృతి సనన్‌కు ఉన్న సంబంధం ఏమిటి ? అనేదే తోడేలు మూవీ స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
తోడెలు సినిమా కథ వరకు వస్తే.. దర్శకుడు అమర్ కౌశిక్.. గతంలో చిరంజీవి హీరోగా వచ్చిన పున్నమి నాగు తరహాలో ఈ సినిమాలో తోడెలు కరిచిన వ్యక్తి ఎలా తోడెలుగా మారి చిత్ర విచిత్రంగా ఎలా ప్రవర్తిస్తాడనేది కాస్త సీరియస్‌గా కాకుండా కామెడీగా చూపించే ప్రయత్నం చేసాడు.ఈ సినిమాలో మొదటి అర గంట వరకు హీరో పరిచయం.. అతను చేసే పనులు చూపిస్తాడు. కాంట్రాక్ట్ పనులు కోసం అరుణాచల్ ప్రదేశ్‌కు రావడం. హీరోను తోడెలు కరిచిన తర్వాత సినిమా అసలు కథ ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్‌లో చూపించినంత ఎమోసన్ను సెకండాఫ్‌లో చూపించడంలో తడబడ్డాడు. స్క్రీన్ ప్లే కూడా సాదాసీదాగా ఉంది. మనిషి తోడేలుగా మారడం అనేది ఏదో మాములుగా చూపించారు. సీరియస్‌గా సాగాల్సిన కథనాన్ని తోడెలుగా మారిన మనిషి .. ఇతరులపై ఎలా దాడికి పాల్పడ్డానేడి సీరియస్‌గా సస్పెన్స్‌గా కాకుండా.. కామెడీగా తెరకెక్కించడంలో సినిమాలో ఉన్న అసలు ఆత్మ దెబ్బతిందనే చెప్పాలి. క్లైమాక్స్‌లో అయిన ఏదైనా కంక్లూజన్ ఇవ్వకుండా ఏదో హడావుడిగా ముగించాడు. మొత్తంగా దర్శకుడు తాను అనుకున్న కథను పూర్తిగా విడమరిచి చెప్పడంలో విఫలమయ్యాడు. కానీ బీ,సీ సెంటర్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఈ సినిమాలో సన్నివేశాలున్నాయి.
సినిమాలో ఆర్ఆర్ బాగుంది. సినిమాలో సన్నివేశాలకు తగ్గట్టు సచిన్ జిగర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయి. 3 డి గ్రాఫిక్ సీన్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫర్ అరుణాచల్ ప్రదేశ్ అందాలను తెరపై చక్కగా ఆవిష్కరించాడు. ఇంటర్వెల్ తర్వాత కథకు అనుగుణంగా లేని సీన్స్‌ను ఎడిట్ చేసి ఉంటే బాగుండేది.
నటీనటుల విషయానికొస్తే..
వరుణ్ ధావన్.. కెరీర్ మొదటి నుంచి ఓ వైపు కమర్షియల్ చిత్రాలు చేస్తూనే.. బద్లాపూర్ వంటి డిఫరెంట్ చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు. బేడియా చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తన ఆహార్యం కోసం బాగా కష్టపడ్డాడు. సినిమా మొత్తం తన భుజాలపై మోసాడు. కృతి సనన్ క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది. హీరో స్నేహితుడి పాత్రలో నటించిన అభిషేక్ బెనర్జీ తనదైన ఎనర్జీతో నవ్వించే ప్రయత్నం చేసాడు. ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు తన పరిధి మేరకు బాగా నటించారు.
ప్లస్ పాయింట్స్
గ్రాఫిక్స్
వరుణ్ ధావన్ నటన
ఫోటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
క్లైమాక్స్
ఆసక్తిగా సాగని కథనం
ఎడిటింగ్
చివరి మాట : తోడేలు.. ఓ వర్గం ప్రేక్షకులను కనెక్ట్ అవుతుంది..
రేటింగ్ : 2.5/5
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telugu Cinema, Thodelu Movie, Tollywood